/rtv/media/media_files/2025/04/03/oAKQamimhXXQdWvYj3qI.jpg)
Donald Trump Tarifs Photograph: (Donald Trump Tarifs)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించారు. ఈ సుంకాలు ఆసియా స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. అయితే ట్రంప్ ఇండియాలో 26 శాతం ప్రతీకార సుంకం విధించారు. దీనివల్ల ఇండియాలో వేటిపై తీవ్రంగా ఎఫెక్ట్ పడనుందో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Trump Tarriffs:ప్రతీకార సుంకాల పై ట్రంప్ కీలక ప్రకటన..భారత్ కు ఎంత శాతం విధించారంటే..!
ఐటీ రంగం
అమెరికా, భారత్ మధ్య ఐటీ ఉత్పత్తుల సేవల పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అమెరికా ఐటీలో భారత్ అతిపెద్ద భాగస్వామిగా ఉంది. ఇండియా నుంచి పెద్ద ఎత్తున సాఫ్ట్‌వేర్ సేవలు, బీపీఓ, ఐటీ కన్సల్టింగ్ సేవలు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతుంటాయి. వీటివల్ల ఇండియాకి కూడా విదేశీ మారక ద్రవ్యం లభిస్తోంది. అయితే ఇకపై సేవలు అందిస్తున్న భారత్ కంపెనీలతో అమెరికా వాణిజ్య బంధాలను తగ్గించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే భారత్ సేవలు అందిస్తే అమెరికా ఎక్కువగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల దేశంలోని పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలతో కాంట్రాక్టులను తగ్గించుకునే అవకాశం ఉంది. దీనివల్ల ఐటీ రంగానికి పెద్ద దెబ్బ పడనుంది.
ఇది కూడా చూడండి: UPI: నిలిచిపోయిన యూపీఐ సేవలు...ఇబ్బందుల్లో వినియోగదారులు
ఫార్మా రంగం
ప్రస్తుతం డోనాల్డ్ ట్రంప్ ఫార్మా దిగుమతులపైన ట్యారిఫ్లను మినహాయించారని వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే పర్లేదు. ఒకవేళ నిజం కాకపోతే ఫార్మా రంగంపై తీవ్ర ప్రభావం పడనుంది. ఎందుకంటే అమెరికా నుంచి భారతదేశం పెద్ద ఎత్తులో జనరిక్ మందులను దిగుమతి చేసుకుంటుంది. వీటిపైన కూడ సుంకం విధిస్తే దేశంలో మందుల ధరలు భారీగా పెరుగుతాయి.
ఇది కూడా చూడండి: Digital arrest: రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్‌ని కూడా వదలని కేటుగాళ్లు.. రూ.3.4 కోట్లు మోసం
ఆటోమొబైల్ రంగం
దేశం నుంచి అమెరికాకు పలు ఆటో స్పేర్ పార్ట్స్ ఎగుమతి అవుతుంటాయి. వీటిపై టారిఫ్స్ పెరిగితే మాత్రం దేశంలోని ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ తయారీ కంపెనీలు నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
టెక్స్ టైల్
ఇండియా నుంచి కాటన్ రెడీమేడ్ గార్మెంట్స్ పెద్ద ఎత్తున అమెరికాకు ఎగుమతి అవుతాయి. వీటిపై కూడా తీవ్ర ప్రభావం పడనుంది. దీంతో పాటు ఆర్టిఫిషియల్ డైమండ్స్ రంగంపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇవి ఇండియా నుంచి అమెరికాకు ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి.
ఇది కూడా చూడండి: Maoist: వారికి శిక్ష తప్పదు.. రేణుక ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల సంచలన లేఖ!
it-industry | latest-telugu-news | donald-trump | today-news-in-telugu | international news in telugu | breaking news in telugu