Chinese MANPADS: అమెరికా ఎయిర్ ఫోర్స్‌కు చుక్కలు చూపిస్తున్న చైనా.. ఇరాన్ చేతిలో మ్యాన్‌ప్యాడ్స్?

పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, అమెరికా వాయుసేనకు ఇరాన్ ఊహించని షాక్ ఇస్తోంది. అత్యాధునిక అమెరికన్ యుద్ధ విమానాలను సైతం నేలకూల్చగల 'మ్యాన్‌ప్యాడ్స్' ఇప్పుడు అగ్రరాజ్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

New Update
_Chinese MANPADS

పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, అమెరికా వాయుసేన(us air force) కు ఇరాన్ ఊహించని షాక్ ఇస్తోంది. అత్యాధునిక అమెరికన్ యుద్ధ విమానాలను సైతం నేలకూల్చగల 'మ్యాన్‌ప్యాడ్స్' ఇప్పుడు అగ్రరాజ్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇరాన్ ఇప్పటికే అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగిల్, A-10 వార్‌హాగ్ వంటి శక్తివంతమైన విమానాలతో పాటు, బిలియన్ డాలర్ల విలువైన E-3 'సెంటి' AWACS రాడార్ విమానాన్ని కూడా కూల్చివేసినట్లు సమాచారం.

ఏమిటీ మ్యాన్‌ప్యాడ్స్?

మ్యాన్-పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ (MANPADS) అంటే ఒకే ఒక్క సైనికుడు తన భుజంపై ఉంచుకుని ప్రయోగించగల క్షిపణులు. ఇవి ఇన్‌ఫ్రారెడ్ టెక్నాలజీతో విమానం నుండి వెలువడే వేడిని గుర్తించి లక్ష్యాన్ని ఛేదిస్తాయి. ఇవి చిన్నవిగా ఉండటంతో వీటిని కనిపెట్టడం కష్టం. అమెరికా రాడార్లకు చిక్కకుండా, కొండ కోనల్లో దాక్కుని వీటిని ప్రయోగించవచ్చు. ఇవి ధ్వని కంటే రెట్టింపు వేగంతో ప్రయాణించి సుమారు 5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న విమానాలను ముక్కలు చేయగలవు.

చైనా వ్యూహాత్మక మద్దతు?

ఇరాన్ తన శక్తిని చాటుకోవడంలో చైనా హస్తం ఉన్నట్లు బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 1,000 మ్యాన్‌ప్యాడ్‌లను చైనా నుండి ఇరాన్ పొందినట్లు అమెరికా(iran america war) నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా QW-2, QW-18 వంటి అధునాతన చైనా మోడళ్లు ఇరాన్ అమ్ములపొదిలోకి చేరినట్లు వార్తలు వస్తున్నాయి. వీటితో పాటు, అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇరాన్ చైనా స్పై శాటిలైట్ (TEE-01B) సేవలను కూడా వినియోగించుకుంటోంది.

Also Read :  ఢిల్లీ కొత్త లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ తరణ్‌జీత్ సింగ్‌పై ట్రంప్ ప్రశంసలు

అమెరికా ఆందోళన ఎందుకు?

సాధారణంగా అమెరికా యుద్ధ విమానాలు ఆకాశంలో చాలా ఎత్తున ప్రయాణిస్తాయి. కానీ భూతల యుద్ధానికి దిగాల్సి వస్తే, అమెరికా విమానాలు తమ కాల్బలానికి మద్దతుగా భూమికి దగ్గరగా, తక్కువ ఎత్తులో ప్రయాణించాల్సి ఉంటుంది. సరిగ్గా ఇక్కడే మ్యాన్‌ప్యాడ్స్ ప్రమాదకరంగా మారుతాయి. ఇరాన్ పర్వత ప్రాంతాల్లో నక్కి ఉండే సైనికులు తక్కువ ఎత్తులో ఎగిరే అమెరికా జెట్‌లను సులభంగా లక్ష్యం చేసుకోవచ్చు.

ట్రంప్ వార్నింగ్

డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ వద్ద విమాన నిరోధక వ్యవస్థలు లేవని గతంలో వ్యాఖ్యానించినప్పటికీ, తాజా నష్టాలు వాస్తవ పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు ట్రంప్ లేఖ రాసినా, చైనా మాత్రం ఆయుధాల సరఫరాను ఖండిస్తోంది. ఒకవేళ ఇరాన్ చైనా నుండి CM-302 సూపర్‌సోనిక్ క్షిపణులను కూడా పొందితే, అది అమెరికా నావికా దళానికి పెను ముప్పుగా పరిణమిస్తుంది.

మొత్తానికి, ఇరాన్ తన వద్ద ఉన్న పరిమిత వనరులతోనే చైనా సాంకేతికతను జోడించి అగ్రరాజ్యానికి సవాలు విసురుతోంది. ఇది కేవలం యుద్ధం మాత్రమే కాదు, అధునాతన సాంకేతికతకు మరియు గెరిల్లా తరహా రక్షణ వ్యవస్థకు మధ్య జరుగుతున్న పోరాటం.

Also Read :  చైనా సాయంతో అమెరికా స్థావరాలపై ఇరాన్ నిఘా!

Advertisment
తాజా కథనాలు