ఆమే నా సీరియస్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ అంటూ పాలాహర్డ్‌తో ప్రేమాయణం గురించి తొలిసారి నోరు విప్పిన Bill Gates

ప్రపంచ అపర కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పాలా హర్డ్‌తో ప్రేమలో ఉన్నట్లు చాలా రోజులుగా వార్తలు వినపడుతున్నాయి.తొలిసారి ఆయన తన ప్రేయసి పాలా హర్డ్‌ను ప్రేమిస్తున్నానని.. తనే నా సీరియస్ గర్ల్‌ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చారు

New Update
bill gates

bill gates

Bill Gates: ప్రపంచ అపర కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 69 ఏళ్ల వయసులోనూ యువకులతో పోటీ పడుతూ మరీ అద్భుతమైన ఆలోచనలు ప్రవేశపెడుతుంటారు. కొన్నేళ్ల క్రితమే భార్యకు విడాకులు ఇచ్చిన ఈయన ఓ మహిళతో ప్రేమలో కూడా పడ్డారు. గత కొంతకాలంగా ఇందుకు సంబంధించి అనేక వార్తలు వినపడుతున్నప్పటికీ ఆయన స్పందించలేదు. 

Also Read:Ind vs Eng: భారత్‌తో తొలి వన్డేకు తుది జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. 15 నెలల తర్వాత అతను ఎంట్రీ!

కానీ తొలిసారి ఆయన తన ప్రేయసి గురించి మాట్లాడారు. తాను నిజంగానే పాలా హర్డ్‌ను ప్రేమిస్తున్నానని.. తనే నా సీరియస్ గర్ల్‌ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చారు. 1955వ సంవత్సరంలో జన్మించిన బిల్ గేట్స్.. 1994లో మెలిందా ఫ్రెంచ్ గేట్స్‌ను వివాహం చేసుకున్నారు. అయితే చాలా ఏళ్ల పాటు  కలిసి జీవించిన వీళ్లకు ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. అయితే 27 ఏళ్ల పాటు అన్యోన్యంగా సాగిన వీరి దాంపత్య జీవితానికి స్వస్తి పలుకుతూ 2021లో విడాకులు తీసుకున్నారు. 

Also Read: Actress Abhinaya: 15 ఏళ్లుగా అతనితో రిలేషన్‌లో ఉన్నాను: విశాల్‌తో పెళ్లిపై నటి అభినయ క్లారిటీ!

అప్పటి నుంచి బిల్ గేట్స్ ఒంటరిగానే జీవిస్తున్నారు. అయితే కానీ ఆయన పాలా హర్డ్‌తో ప్రేమలో ఉన్నట్లు చాలా రోజులుగా వార్తలు వినపడుతున్నాయి. వీరిద్దరూ కలిసి డేటింగ్ కూడా చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున రుమార్లు వినపడుతున్నాయి. ఒరాకిల్ సీఈరో మార్క్ హర్డ్ భార్య అయిన పాలా హర్డ్ వయసు ఇప్పుడు 60 సంవత్సరాలు. అయితే 2019లోనే ఈమె భర్త చనిపోగా.. అప్పటి నుంచి ఇద్దరు కుమార్తెలతో ఆమె ఉంటున్నారు.

అయితే ఈమెతోనే బిల్ గేట్స్ ప్రేమలో పడ్డట్లు సమాచారం. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి 2023 జనవరి నెలలో ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీ సందర్భంగా కలిసి వెళ్లి మరీ మ్యాచ్ తిలకించారు. ఇద్దరూ పక్క పక్కనే కూర్చుని ప్రేమగా చూసుకోవడం గమనించిన కొందరు వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలు రాశారు. అయితే ఇంత కాలం దీనిపై వారిద్దరిలో  ఒక్కరూ కూడా స్పందించలేదు. కనీసం ఆ వార్తలను కూడా ఖండించలేదు.

సీరియస్ గర్ల్‌ఫ్రెండ్...

కానీ తాజాగా ఈ వార్తలపై బిల్ గేట్స్ తొలిసారిగా స్పందించారు. పాలా హర్డ్ తన సీరియస్ గర్ల్‌ఫ్రెండ్ అని చెప్పుకొచ్చారు. పాలా తనకు పరిచయం అవ్వడం తన అదృష్టం అని అన్నారు. తామిద్దరూ కలిసే ఉంటున్నట్లు చెప్పిన ఆయన.. కలిసే పని చేసుకుంటామని, హాయిగా మ్యాచ్‌లు చూస్తామని పేర్కొన్నారు. ఆమెలాంటి మంచి వ్యక్తిని ఇప్పటి వరకు తాను చూడ లేదని పాలా హర్డ్‌పై తనకున్న ప్రేమను వెల్లడించారు బిల్ గేట్స్.

Also Read:Illegal Indian Migrants: అమెరికా నుంచి అక్రమ వలసదారులు ఔట్‌.. అమృత్‌సర్‌లో ల్యాండ్ అయిన విమానం

Also Read:Trump: వణికిస్తున్న ట్రంప్‌.. విదేశీ రాజకీయ నిధుల పై పట్టుబిగించిన గ్రీన్‌ ల్యాండ్‌!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు