/rtv/media/media_files/2025/03/18/WsUf2voKTZcd37obKYRX.jpg)
astronut sunitha williams
ఎనిమిది రోజులుకు వెళ్ళిన వాళ్ళు తొమ్మిది నెలలు ఉండిపోయారు. అది కూడా భూమి మీద అన్నీ అనుకూలంగా ఉండే ప్రదేశంలో కాదు. అంతరిక్షంలో భార రహిత స్థితిలో. అక్కడ ఆక్సిజన్ తో పాటూ అన్నీ కష్టమే. తినాలన్నా, తాగాలన్నా, పడుకోవాలన్నా కూడా కూడా ప్రత్యేకంగా చేయాలి. గాల్లో తేలియాడుతూ బతకాలి. అలాంటి స్థితిలో పదిరోజులు ఉండడమే కష్టం అంటే అస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్ (Sunita Williams), బుచ్ విల్ మోర్ లు తొమ్మిది నెలలు గడిపారు. చేయడానికి పని ఉండదు, మాట్లాడ్డానికి ఎవరూ ఉండరు. చుట్టూ శూన్యం. ఎలాగో ఒకలా తిరిగి వచ్చేస్తాము అనుకోవడానికి అస్సలే లేదు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఇంతకు ముందు ఏ వ్యోమగామి ఎదుర్కోని కష్టాలను సునీతా విలియమ్స్ ఎదుర్కోవలసి వచ్చింది. అది కూడా 59 ఏళ్ళ వయసులో. ఇది మామూలు విషయం కాదు. మంచి వయసులో ఉన్నవారే కుంగిపోయే పరిస్థితి.
Also Read : కన్నప్ప నుంచి 'మహాదేవ శాస్త్రి' గర్జన.. మోహన్ బాబు ఇంట్రో సాంగ్!
భగవద్గీతే ఆదర్శం..
అనుభవం నేర్పిన సంయమనంతో, ఒపికగా భూమి మీదకు తిరిగి రావడానికి ఎదురు చూశారు సునీతా విలియమ్స్. సమస్యలకు వెన్నుచూపని దృఢచిత్తం, భవిత పట్ల సానుకూల దృక్పథంతో ఆ పరీక్షలో నెగ్గుకొచ్చారు. మరికొన్ని గంటల్లో నేల మీదకు చేరనున్నారు సునీతా, బుచ్ విల్ మోర్ లు. తనకెంతో ఇష్టమైన భగవద్గీతతో పాటు ఉపనిషత్తులను వెంటతీసుకుని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎన్ఎస్ లోకి అడుగు పెట్టిన సునీతా... అవి ఇచ్చిన స్ఫూర్తితోనే ఇన్నాళ్ళు గడిపారు. తనలోని ధైర్యాన్ని పోనివ్వకుండా చూసుకున్నారు. మన మనసే మన నేస్తం... అదే మన శత్రువు కూడా అన్న శ్రీకృష్ణుని మాటలను తలుచుకుంటూ మనసునూ , బుద్ధినీ రెండింటినీ అదుపులో పెట్టుకుని భూమి మీదకు తిరిగి వస్తామని ధృడ సంకల్పంతో వెయిట్ చేశారు. మానసికంగా శారీరకంగా అనేక సమస్యలకు ఎదురొడ్డుతూ పని మీదే ధ్యాస పెట్టి పరిశ్రమించడానికి మన ఆధ్యాత్మిక గ్రంథాలు ఉపకరిస్తాయని అంటారు సునీత.
Also Read : పెనుగంచిప్రోలు తిరుణాల్లలో ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్ల దాడి
తొమ్మిది నెలల పాటూ అంతరిక్షంలో గడిపిన సునీతా విలియమ్స్ 900 గంటలపాటూ అంతరిక్షంలో శాస్త్రీయ పరిశోధనలు చేశారు. 62 గంటలకు పైగా స్పేస్ వాక్ (Space Walk) చేసి..ఈ ఘనతను సాధించిన తొలి మహిళగా రికార్డ్ సాధించారు. ఈమెకన్నా ముందు రష్యన్ వ్యోమగామి వాలెరి పాలియాకోవ్ 1994-95లో వరుసగా 438 రోజుల పాటు అంతరిక్షంలో ఉండి రికార్డు సృష్టించారు. ఆయన తరవాత సెర్గీ అవదీవ్ 379 రోజులు, ఫ్రాంక్ రుబియో 371, వ్లాదిమిర్ తితొవ్ 365, క్రిస్టీనా కోచ్ 328 రోజులు ఉన్నారు. ఇప్పుడు ఐఎన్ఎస్ లో సునీతా, బుచ్ లు 280 రోజులు ఉండి ఆ జాబితాలో చేరారు.
Also Read: AP: వేగంగా ఏపీలో అభివృద్ధి.. విశాఖ, విజయవాడ, తిరుపతిల్లో లులూ మాల్స్
Also Read : అక్కడ బిర్యానీ తింటున్నారా..జర జాగ్రత్త