Musk: 13వ సంతానంపై మస్క్ సంచలన వ్యాఖ్యలు..ఆ బిడ్డకు తండ్రి నేను కాదేమో!

ప్రపంచ కుబేరుడు మస్క్ 14 మంది పిల్లలకు తండ్రి అనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆష్లే, మస్క్ 13వ బిడ్డకు జన్మనిచ్చారని ప్రకటించారు.అయితే దీనిపై తాజాగా మస్క్ ఆ బిడ్డకు తండ్రి నేను కాదేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.

New Update
Elon Musk: మస్క్ మామకు టెస్లా దెబ్బ మామూలుగా లేదు..రెండు నెలల్లో ఎన్ని లక్షల కోట్లు  కోల్పోయాడంటే.!

Elon Musk

ఎక్స్‌ అధినేత,ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన మాజీ ప్రియురాలు ఆష్లే సెయింట్ క్లేర్‌‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెకు పుట్టిన బిడ్డ గురించి ఘోరంగా మాట్లాడారు. అసలు ఆ బిడ్డకు తాను తండ్రి కాదేమోనని ఎలాన్ మస్క్ అనుమానం వ్యక్తం చేశారు. కొన్నేళ్ల కిందట మస్క్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆష్లే రిలేషన్‌‌షిప్‌లో ఉన్నారు. ఈ క్రమంలో ఈ జంటకు ఓ మగ సంతానం కలిగింది. మస్క్‌కు ఆ బిడ్డ 13వ సంతానం. అయితే, ఆ బాబు పుట్టిన తర్వాత ఇద్దరూ తమ బంధానికి స్వస్తి చెప్పారు. కోర్టు ఆదేశాలతో ఆమెకు ఖర్చుల కింద ఎలాన్ మస్క్ ఏటా 5 లక్షల డాలర్లు ఇస్తున్నారు.

Also Read:  Breaking: ఏపీలో బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి..

అయితే, ఆష్లై క్లైర్‌పై అమెరికాకు చెందిన హక్కుల కార్యకర్త లారా లూమర్ ఎక్స్‌ లో  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ధనవంతులకు తన అందంతో వల విసిరే ఆష్లే అత్యంత ఖరీదైన కారులో తిరుగుతూ కెమెరాకు అడ్డంగా చిక్కింది... దాని విలువ లక్ష డాలర్లు ఉంటుంది.. రిలేషన్‌షిప్‌లో ఉన్నపుడు ఎలాన్ మస్క్ తనకు బహుమతిగా ఇచ్చాడని గర్వంగా చెప్పుకుని తిరుగుతోంది’ అంటూ విమర్శలు గుప్పించింది. తన బిడ్డ కోసమే టెస్లా కారును అమ్మేస్తున్నట్టు ఆష్లే చెబుతోన్న వీడియోను షేర్ చేసింది.

Also Read: Horoscope: నేడు ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు..

లారా లూమర్‌ పోస్ట్‌పై మస్క్ స్పందిస్తూ.. ‘‘ఆ బాబు నా బిడ్డా? కాదా? అనేది నాకు తెలియదు.. అంతేకాదు.. ఆ బిడ్డ ఎవరో తెలుసుకోవాలని నాకు లేదు.... న్యాయస్థానం ఆదేశాలు కూడా అవసరం లేదు. నిజం ఏంటో తెలీదు కాబట్టి.. నేను ఇప్పటి వరకు ఆమెకు 2.5 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.21 కోట్లు) ఇచ్చాను. ఏటా 5 లక్షల డాలర్లు పంపాను’ అని మస్క్ సమాధానమిచ్చారు. 

తన మాజీ ప్రియుడు పోస్ట్‌పై ఆష్లే ఘాటుగా స్పందించింది. నేను కడుపుతో ఉన్నపుడే .. బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకోవడానికి పరీక్ష చేయించమని చెబితే, మీరే వద్దన్నారని కౌంటర్ ఇచ్చింది. ‘‘బిడ్డ కడుపులో ఉన్నప్పుడే టెస్ట్ చేయించమంటే.. నువ్వు వద్దన్నావు.. నాకు డబ్బులు కూడా సక్రమంగా పంపటం లేదు.. మన బిడ్డ కోసం పంపుతున్నావు.. నన్ను ఇబ్బంది పెట్టడానికి తక్కువ మొత్తం ఇస్తున్నావు. కానీ, నువ్వు నీ కొడుకును ఇబ్బందిపెడుతున్న విషయం మరిచిపోతున్నావు.. సోషల్ మీడియా నా పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నాం’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

కాగా, మస్క్, తాను ఓ బిడ్డకు జన్మనిచ్చినట్టు అష్లే సెయింట్ క్లైర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో చేసిన ప్రకటనతోనే ఈ వివాదం మొదలైంది. బిడ్డ సంరక్షణ కోసం న్యూయార్క్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మస్క్ కేవలం మూడుసార్లు మాత్రమే బిడ్డను కలిశాడని, సంరక్షణలో అతడికి ఎలాంటి ప్రమేయం లేదని ఆమె ఆరోపించింది. అంతేకాదు, మా ఇద్దరి రిలేషన్‌షిప్ గురించి బయటపెట్టకుండా నోరునొక్కే ప్రయత్నం చేశారని వెల్లడించారు. నా బిడ్డకు మస్క్ తండ్రి అని వాదిస్తూ.. గర్భం దాల్చిన సమయంలో తాను వేరేవాళ్లతో లైంగిక సంబంధం పెట్టుకోలేదని చెప్పుకొచ్చింది.

Also Read: Musk-Tesla Cars: టెస్లా షోరూంలో అగ్ని ప్రమాదం... 17 కార్లు దగ్ధం..వారి చర్యే అంటున్న మస్క్‌!

Also Read: Trump-America:ఈ సారి ట్రంప్‌ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు!

elan-musk | ashley saint clair | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Trump: ఆ దేశం అస్సలు వెళ్లకండి.. అమెరికన్లకు ట్రంప్‌ హెచ్చరిక

ట్రంప్ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. పర్యాటక రంగంలో ప్రసిద్ధి చెందిన బహమాస్‌కు వెళ్లే అమెరికన్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. అక్కడ నేరాలు, షార్క్‌ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వీలైతే ఆ దేశం వెళ్లకూడదని కోరింది.

New Update
Do not travel to Bahamas, there are sharks:,Trump admin advises Americans

Do not travel to Bahamas, there are sharks:,Trump admin advises Americans

ట్రంప్ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. పర్యాటక రంగంలో ప్రసిద్ధి చెందిన బహమాస్‌కు వెళ్లే అమెరికన్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. అక్కడ నేరాలు, షార్క్‌ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వీలైతే ఆ దేశం వెళ్లకూడదని కోరింది. బహమాస్ అనేది కామన్వెల్త్ దేశాల్లో ఒక స్వతంత్ర దేశం. పర్యాటక పరంగా దీనికి మంచి గుర్తింపు ఉంది. అయితే ఈ మధ్య అక్కడికి వెళ్లే పర్యటకులపై కొందరు దుండగులు దోపిడీలకు పాల్పడుతున్నారు. 

Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

అంతేకాదు మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు. ఆఖరికీ హత్యలకు కూడా చేయడానికి వెకాడటం లేదు. అలాగే బహమాస్ సముద్ర జలాల్లో షార్క్‌ దాడుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ఆ దేశానికి వెళ్లకూడదని ట్రంప్ సర్కార్ ప్రజలకు సూచనలు చేసింది.అక్కడ అద్దె గదుల్లో కూడా ఉండటం సురక్షితం కాదని చెపింది. ప్రైవేట్ సెక్యూరిటీ లేని ప్రాంతంలో బస చేయడం మంచిది కాదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మార్చి 31న ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

పర్యాటకులు మార్గదర్శకాలను నిర్లక్ష్యం చేసి ఆయుధాలు, తుపాకులు తీసుకెళ్లడం చట్టారీత్యా నేరమంటూ హెచ్చరించింది. రూల్స్‌ ఉల్లంఘిస్తే ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు కఠినంగా చర్యలు తీసుకుంటారని తెలిపింది. అరెస్టులు, జైలుశిక్ష, జరిమానా విధిస్తారని మార్గదర్శకాల్లో పేర్కొంది. 

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

trump | telugu-news | rtv-news | usa

Advertisment
Advertisment
Advertisment