/rtv/media/media_files/2025/03/14/jgsG0C83wnpvp5WYv9T2.jpg)
flight
అమెరికాలోని డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయం గేటు వద్ద దిగిన విమానంలోఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా ప్రయాణికులను బయటకు పంపించారు. విమానం రెక్క పై నిలబడిన ప్రయాణికులను సిబ్బంది కిందకు దింపుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో బయటకు వచ్చాయి.
Also Read: Kerala: పాలక్కాడ్‌లో అత్యధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు...రెడ్ అలర్ట్!
అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని వెల్లడించారు. ఈ ఘటన పై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొలరాడో స్ప్రింగ్స్ ఎయిర్‌పోర్టు నుంచి డాలస్ ఫోర్ట్ వర్త్ కు బయల్దేరిన అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.
#BREAKING: American Airlines plane catches on fire at Denver airport.@COLORADO @DENVER
— RC (@RealChange__) March 14, 2025
pic.twitter.com/PH1LtLEJ7G
Also Read: Russia-Trump: ఒప్పందం పై పుతిన్ అనుకూల వ్యాఖ్యలు..ఒకవేళ తిరస్కరిస్తే అంటున్న ట్రంప్!
ఇంజిన్ లో వైబ్రేషన్స్ రావడంతో వెంటనే విమానాన్ని డెన్వర్ కు మళ్లించి అత్యవసరంగా దించేశారు. ఎయిర్‌పోర్టులోని టాక్సీయింగ్ ప్రదేశంలో విమానం దిగిన వెంటనే ఇంజిన్ లో మంటలు తలెత్తాయి. చూస్తుండగానే విమానమంతా దగ్ధమైంది. అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను అత్యవసర ద్వారాల నుంచి బయటకు తీసుకొచ్చారు.
అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని అధికారులు వెల్లడించారు.దీని పై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.ఘటన సమయంలో విమానంలో 172 మంది ప్రయాణికులు,ఆరుగురు సిబ్బంది ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది చాలా సేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
Also Read: Live News Updates: బీసీలకు సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. ఒక్కొక్కరికీ రూ.20 వేలు..!
Also Read: భగ్గుమంటున్న పసిడి ధరలు.. హైదరాబాద్‌లో ఈ రోజు తులం ఎంతుందంటే?