/rtv/media/media_files/2025/02/07/B3fqia0F3DOufMFT5OVD.jpg)
Donald Trump, India Pm Modi
US Tech Layoffs: అమెరికా ట్రంప్(America Trump) ప్రభుత్వం భారతీయులకు వరుస షాక్‌లు ఇస్తోంది. ఇప్పటికే అక్రమవలస దారుల(Illegal Immigrants) పేరిట వందల మందిని ఇండియాకు పంపిస్తున్న అగ్రరాజ్యం తాజాగా సాఫ్ట్ వేర్ ఉద్యోగుల(Software Employees)పై కన్నేసింది. ఈ మేరకు యూఎస్ టెక్ కంపెనీల్లో ఉద్యోగుల కోత(US Tech Layoffs)మొదలుపెట్టింది. మైక్రోసాఫ్ట్(Microsoft), మెటా(Meta), అమెజాన్(Amazon), వాల్‌మార్ట్(Walmart), స్ట్రైప్, సేల్స్‌ఫోర్స్ ఇతరత్రా సంస్థలు లేఆఫ్స్ ప్రకటించి ఉద్యోగుల గుండెల్లో గుబులు రేపాయి. 2025లో మరిన్ని జాబ్స్ తొలగించనున్నట్లు సంకేతాలిచ్చాయి.
Also Read: ఢిల్లీ ఫలితాలపై కోమటిరెడ్డి రియాక్షన్.. కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్!
28 శాతం మంది జాబ్స్ ఊస్ట్..
అమెరికాలోని కోచింగ్ కంపెనీ చాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్ లేటెస్ట్ సర్వే ప్రకారం డిసెంబర్‌తో పోలిస్తే జనవరిలో పలు కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగాలను తొలగించాయి. 2024 డిసెంబర్‌లో 38,792, 2025 జనవరిలో 49,795 ఉద్యోగాలు తీసివేయగా మొత్తం 28 శాతం మంది జాబ్స్ కోల్పోయారు. అయితే లాభాలు పెంచుకునే క్రమంలో ఇన్వెస్టర్ల ఒత్తిడికి గురవుతున్న కంపెనీలు.. ఉద్యోగాలను తగ్గించుకుంటున్నాయి. కరోనా సమయంలో కంజ్యూమర్ టెక్‌పై ఖర్చులు అధికమవడంతో తప్పనిసరి కావాల్సిన సిబ్బందిని మాత్రమే తీసుకున్నాయి. ప్రస్తుతం వారిని కూడా తొలగించేందుకు ప్లాన్ చేస్తున్నాయి.
Also Read: వంటలో నల్ల మిరియాలు వాడితే బరువు తగ్గుతారా?
AI కారణంగా మరికొన్ని కంపెనీలు..
ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా మరో 5ఏళ్లలో 41శాతం ఇంటర్నేషనల్ కంపెనీలు శ్రామికులను తగ్గించుకునేందుకే సిద్ధమవుతున్నట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సర్వే వెల్లడించింది. ఇప్పటికే 25కు పైగా సంస్థల్లో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా సీఈవో పనితీరు సరిగా లేని 3,600 మందిని తొలగించింది. AI ఆధారిత సేవలు, పరికరాలను రూపొందించడంలో కంపెనీ ముందుకు సాగుతోందని మార్క్ జుకర్‌బర్గ్ అన్నారు. AI కారణంగా వర్క్‌డే సాఫ్ట్‌వేర్ కంపెనీ 1,750 మందికి ఉద్వాసన పలికింది. ఇక గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా కంపెనీలు జనవరిలో ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు అందించినట్లు తెలుస్తోంది. మరోవైపు అమెరికా సంపద పెరుగుతన్నప్పటికీ టెక్ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Ranveer Allahbadia: పేరెంట్స్ సె**క్స్ పై ప్రశ్న దుమారం.. క్షమాపణ చెప్పిన యూట్యూబర్!
స్వచ్ఛంద రిజైన్ ఆఫర్..
అమెజాన్ తమ కమ్యూనికేషన్స్ యూనిట్‌లో పదుల సంఖ్యలోనే ఉద్యోగాలను కేటాయించింది. ఆకన్సవ్‌లలోని కన్సాలిడేషన్‌లో భాగంగా వాల్‌మార్ట్ కాలిఫోర్నియాలో వందలాది ఉద్యోగులను తీసివేయడంతోఆపటు నార్త్ కరోలినాలో ఒక కార్యాలయాన్ని పూర్తిగా మూసివేసింది. ఇక ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్, నెస్ట్, యూఎస్ ఆధారిత ఉద్యోగులకు గూగుల్ స్వచ్ఛంద రిజైన్ ఆఫర్ చేసింది. అయితే వీరికి హోదా ఆధారంగా పరిహారం అందించనుంది. సేల్స్‌ఫోర్స్ 1,000 మందిని తగ్గించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రొడక్ట్, ఇంజనీరింగ్, ఆపరేషన్స్ విభాగాల్లో 300 ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు స్ట్రైప్ అనౌన్స్ చేసింది.