UK: స్పోర్ట్స్‌ షూ వేసుకొచ్చిందని జాబ్ నుంచి తొలగింపు.. కంపెనీకి బిగ్ షాక్

లండన్‌లో ఓ కంపెనీ తమ ఉద్యోగి డ్రెస్ కోడ్ పాటించలేదనే చిన్న కారణంతో ఉద్యోగం నుంచి తీసేసింది. చివరికి ఆ కంపెనీకి 30 వేల పౌండ్లు (రూ.32,20,818) జరిమానా పడింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.

New Update
Shoes and Working Woman

Shoes and Working Woman

ఎవరైనా సరిగా పనిచేయనప్పుడు, గోడవలు పెట్టుకున్నప్పుడు, ఇంకా ఇతరాత్ర కారణాల వల్ల ప్రైవేటు కంపెనీలు సాధారణంగా ఉద్యోగులను తొలగిస్తాయి. అయితే లండన్‌లో ఓ కంపెనీ మాత్రం తమ ఉద్యోగి డ్రెస్ కోడ్ పాటించలేదనే చిన్న కారణంతో ఉద్యోగం నుంచి తీసేసింది. చివరికి  ఆ కంపెనీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఉద్యోగికి కంపెనీ 30 వేల పౌండ్లు (రూ.32,20,818) చెల్లించాలని ఉద్యోగ ట్రైబ్యునల్‌ ఆదేశించింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

Also Read: మా నాన్న చనిపోతే ఏం చేశారు.. కాంగ్రెస్‌పై ప్రణబ్ ముఖర్జీ కూతురు సంచలన ఆరోపణలు..

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎలిజబెత్ బెనాస్సీ (18) అనే యువతి 2022లో లండన్‌లోని మ్యాక్సిమస్ యూకే సర్వీసెస్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. అయితే కొన్నిరోజుల తర్వాత ఆమె డ్రెస్ కోడ్ పాటించకుండా స్పోర్ట్స్‌ షూ వేసుకొచ్చింది. దీంతో ఆ కంపెనీ ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగించింది. దీంతో ఆ యువతి ఉద్యోగ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది. కంపెనీకి డ్రెస్ కోడ్ ఉందనే విషయం తనకు తెలియదని పేర్కొంది. తెలియకుండా షూ వేసుకెళ్లినందుకు ఓ మేనేజర్ తనను తిట్టారంటూ కూడా చెప్పింది.     

Also Read: చెన్నై గ్యాంగ్‌ రేప్ ఘటన.. నిందితుడికి డీఎంకేతో సంబంధాలు !

కంపెనీ కూడా ట్రైబ్యునల్‌లో తమ వాదనలు వినిపించింది. ఈ విషయంలో తమ తప్పు లేదని చెప్పింది. ఇరువైపు వాదనలు విన్న ట్రైబ్యునల్‌ ఆ  ఉద్యోగురాలి వైపే అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆమెకు కంపెనీ రూ.32 లక్షల పరిహారం ఇవ్వాలన ఆదేశించింది. '' ఆమె ఉద్యోగంలో కొత్తగా చేరింది. డ్రెస్ కోడ్ గురించి ఆమెకు తెలిసుండకపోవచ్చు. ఇంతదానికే మరో అవకాశం కూడా ఇవ్వకుండా ఆమెను ఉద్యోగంలోని తొలగించడం అన్యాయమని పేర్కొంది.    

Also Read: తండ్రి మోసం కూతురి మరణం కేసు.. ముగ్గురు నిందితులకు రిమాండ్!

Also Read: స్టుపిడ్‌ షాట్.. గెట్‌అవుట్ ఫ్రమ్ డ్రెస్సింగ్ రూమ్: సన్నీ ఫైర్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Waqf Amendment Bill: వక్ఫ్‌ బిల్లు వివాదం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్‌, ఎంఐఎం

పార్లమెంట్ ఉభయ సభల్లో వక్ఫ్ (సవరణ) బిల్లు 2025 ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. అయితే ఈ బిల్లుపై తాజాగా కాంగ్రెస్, ఎంఐఎం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కాంగ్రెస్ ఎంపీ మహ్మద్‌ జావేద్‌, హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్ ఒవైసీ కోర్టులో పిటిషన్ వేశారు.

New Update
Waqf Amendment Bill

Waqf Amendment Bill

పార్లమెంట్ ఉభయ సభల్లో వక్ఫ్ (సవరణ) బిల్లు 2025 ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. అయితే ఈ బిల్లుపై తాజాగా కాంగ్రెస్, ఎంఐఎం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కాంగ్రెస్ ఎంపీ మహ్మద్‌ జావేద్‌, హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్ ఒవైసీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ బిల్లుపై రాజ్యాంగ చెల్లుబాటు అంశాన్ని సవాల్ చేశారు. ఇందులో ముస్లిం సమాజ ప్రాథమిక హక్కులు ఉల్లంఘించేలా ఉన్నాయని తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లు వక్ఫ్ ఆస్తులు, అలాగే వాటి నిర్వహణపై ఏకపక్షంగా ఉందని ఆరోపించారు. 

Also Read: గ్రూప్ 1 నియామకాలకు లైన్ క్లియర్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు!

ఇది ముస్లిం సమాజ స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుందని చెప్పారు. కోర్టు దీనిపై విచారణ చేయాల్సి ఉంది. ఇదిలాఉండగా ఈ వక్ఫ్‌ (సవరణ) బిల్లు లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం పొందడంతో కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్‌లోని పలుచోట్ల ముస్లింలు నిరసనలు చేశారు. శుక్రవారం ప్రార్థనలు చేసిన అనంతరం పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేశారు. మరోవైపు తమిళనాడులో నటుడు విజయ్‌ పార్టీ టీవీకే రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది.    

Also Read: కంచ గచ్చిబౌలి భూములపై పోలీస్ శాఖ కీలక ఆదేశాలు.. ఎంట్రీకి పూర్తి నిషేధం!

 చెన్నై, కోయంబత్తూర్ వంటి ప్రధాన నగరాల్లో టీవీకే కార్యకర్తలు వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేక ఆందోళనలు చేశారు. మరోవైపు శాంతి భద్రతలకు వాటిల్లకుండా చూసేందుకు ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పారమిలటరీ బలగాలతో కలిసి శుక్రవారం జామియానగర్, జామియా మిలియా  ఇస్లామియాతో పాటు నగరంలోని పలు సున్నితమైన ఏరియాల్లో కవాతు నిర్వహించారు. మొత్తానికి ఈ బిల్లును రద్దు చేయాలని ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కొత్త చట్టం వల్ల వక్ఫ్ భూముల సర్వే అధికారాలు కలెక్టర్లకు మారిపోతాయని దీనివల్ల భూ ఆక్రమణలకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయని ముస్లిం నేతలు ఆరోపణలు చేస్తున్నారు. బినామీల ద్వారా వక్ఫ్‌ భూములు కబ్జా చేసేందుకు ఇది ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. 

 rtv-news | Waqf Board Bill | waqf-amendment-bill | national-news | bjp

 

Advertisment
Advertisment
Advertisment