/rtv/media/media_files/2026/04/10/woman-body-found-stuffed-inside-bed-box-in-outer-delhi-2026-04-10-21-07-59.jpg)
Woman body found stuffed inside bed box in outer Delhi
ఢిల్లీ(delhi) లోని ఓ పీజీ హాస్టల్‌లో దారుణం జరిగింది. ఓ మహిళ తన ప్రియుడి చేతిలో హత్యకు గురైంది. బెడ్‌బాక్స్‌లో ఆమె మృతదేహం లభ్యమైంది. మంగోల్‌పురి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఏప్రిల్ 7న ఓ మహిళ (35) తన 22 ఏళ్ల ప్రియుడితో కలిసి పీజీ హాస్టల్‌కు వచ్చింది. గంట సేపటి తర్వాత ఆ యువకుడు హాస్టల్ నుంచి వెళ్లిపోయాడు. దీంతో అనుమానం వచ్చిన పీజీ హాస్టల్ ఓనర్ ఆమె గదిని చెక్ చేశాడు. చివరికి బెడ్ బాక్స్‌లో ఆ మహిళ మృతదేహం చూసి అతడు కంగుతున్నాడు.
Also read: భక్తి పేరుతో నర్మదా నదిలోకి 11 వేల లీటర్ల పాలు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు
Woman Body Found Stuffed Inside Bed Box
సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు ఆమె నుదుటిపై గాయం, గొంతు నులిమిన గుర్తులు కూడా ఉన్నాయి. అయితే నిందితులు ఆమెను బంధించి, గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
Also Read: నడిరోడ్డుపై డ్రైవర్ తల నరికిన వ్యక్తి.. వీడియో వైరల్
ఈ హత్య ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుడైన ఆమె ప్రియుడు దీపక్‌తో పాటు అతడికి సహకరించిన మరో ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళపై హత్య చేయడానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు. అయితే హత్యకు ముందు ఆమెపై లైంగిక దాడి జరిగిందా ? లేదా ? అనేదానిపై క్లారిటీ లేదు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే దీనిపై స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Follow Us