/rtv/media/media_files/2025/02/14/A9YLhB9Swnwb0PTfLfbT.jpg)
Vizianagaram software engineer murder case police solved
AP Crime: విజయనగరం జిల్లా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్యకేసులో మిస్టరీ వీడింది. ప్రసాద్ హత్యకు వివాహేతర బంధమే కారణమని పోలీసులు వెల్లడించారు. అచ్చుతరావు భార్య లక్ష్మీతో అక్రమ సంబంధం పెట్టుకున్న కృష్ణనే మర్డర్ సూత్రధారిగా గుర్తించారు.
ఇద్దరితో అక్రమ సంబంధం..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు అచ్యుతరావు, కృష్ణ వరుసకు అన్నదమ్ములు. ప్రసాద్‌కు అచ్యుత రావు భార్య వెంకటలక్ష్మితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే వెంకట లక్ష్మికి అప్పటికే అచ్యుత రావు తమ్ముడు కృష్ణతోనూ అక్రమ సంబంధం ఉంది. ఈ క్రమంలో ప్రసాద్‌తో లక్ష్మి చనువుగా ఉండటం గమనించిన కృష్ణ కోపం పెంచుకున్నాడు. దీంతో ఎలాగైన వారి బంధాన్ని విడదీయాలని ప్లాన్ చేశాడు. దీంతో పథకం ప్రకారం నమ్మించి ప్రసాద్‌ను పొలం దగ్గరికి రప్పించాడు.
చంపి స్నానం చేసి..
ప్రసాద్ వచ్చి రాగానే ఇద్దరు అన్నదమ్ములు కృష్ణ, అచ్యుతరావు దారుణంగా కొట్టి చంపారు. కర్రలు, బండలతో కొట్టి హతమార్చారు. ప్రసాద్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత శవాన్ని నెమలాం బూర్జవలస రహదారిపై పడేశారు. ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా ప్రసాద్ మొబైల్ బావిలో పడేశారు. అనంతరం చెరువులో స్నానం చేసి ఎవరికీ అనుమానం రాకుండా ఇంటికి వెళ్లారని పోలీసులు దర్యాప్తులో పేర్కొన్నారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
ఇది కూడా చదవండి: Pakistanis Deported: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. 12 దేశాల నుంచి బహిష్కరణ!