Crime: వివాహితతో అక్రమ సంబంధం.. పెళ్లి చేసుకోమన్నందుకు 'సలార్' కత్తితో తల నరికేసిన ప్రియుడు!

యూపీలో మరో గురుమూర్తి ఘటన కలకలం రేపింది. బహ్‌రైచ్ లో అక్రమ సంబంధం కారణంగా మహిళ ప్రాణాలు కోల్పోయింది. పెళ్లి చేసుకోమని అడిగిన సజరూన్ ను ప్రియుడు ఆసిఫ్ 'సలార్' మూవీలాంటి కత్తితో తల నరికేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

New Update
up murder

Uttar Pradesh lover killed married woman

Crime: యూపీలో మరో గురుమూర్తి ఘటన కలకలం రేపుతోంది. అక్రమ సంబంధం కారణంగా మరో వివాహిత ప్రాణాలు కోల్పోయింది. పెళ్లై ఇద్దరు పిల్లలున్న ఆమె.. భర్తను కాదని ప్రియుడితో రంకు మొదలుపెట్టింది. అయితే చివరికి ఆ ప్రియుడే ఆ మహిళను అత్యంత దారుణంగా తల నరికి చంపడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అంతేకాదు తలతోపాటు ఆమె చేతులను సైతం నరికి ముక్కలు ముక్కలు చేసిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బహ్‌రైచ్ జిల్లాలో ఉత్కంఠ రేపగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ముఖం లేని డెడ్ బాడీ.. 

ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బహ్‌రైచ్ లోని నాన్‌పారా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఒక కాలువ ప్రవహిస్తుంది. అదే కాలువ ఒడ్డున తల లేని ఒక మహిళ మృతదేహాన్ని కనుగొన్నాము. అయితే మృతదేహం తల అక్కడ లేదు. డెడ్ బాడీ స్వాధీనం చేసుకున్నాం. కానీ ఆ మృతదేహం ముఖం లేని కారణంగా బాడీ ఎవరిది అనే విషయం గుర్తించడం సాధ్యం కాలేదు. కానీ ఈ హత్య మార్చి 7న జరిగినట్లు నిర్ధారించాం. ఆమెను చంపేందుకు హంతకుడు ప్రత్యే ఆయుధాన్ని తయారు చేశాడు. ప్రభాస్ సినిమా 'సలార్'లో వాడిన కత్తినపోలిన కత్తితో ఆమెను హతమార్చాడు. ఆ మహిళ తలతో పాటు ఆమె చేతులు కూడా కనిపించలేదు. ఈ కేసు దర్యాప్తులో ఆమె బహ్‌రైచ్ కు దగ్గరగా ఉన్న శ్రావస్తిలోని చమ్రపూర్వ గ్రామ నివాసి అని వెల్లడైంది. ఆ మహిళ పేరు సజరూన్.

భర్త, ఇద్దరు పిల్లలుండగానే..

సజరూన్ భర్త ముంబైలో పనిచేస్తుండగా సజరూన్ తన తల్లి ఇంట్లో చమ్రపూర్వా గ్రామంలో ఉంటోంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆమెకు తన గ్రామంలోని ఆసిఫ్ అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కొంతకాలంగా బాగానే నడిచిన రిలేషన్ లో ఉన్నట్టుండి ఈ హత్యకు దారితీయడం ఆశ్చర్యం కలిగించింది. మార్చి 6న ఇద్దరి మొబైల్ ఫోన్ల లొకేషన్ ద్వారా కలిసే కాలువ ఒడ్డుకు వెళ్లారని వెల్లడైంది. ఈ హత్య తర్వాత ఆసిఫ్ పారిపోయాడు. అతను నేపాల్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా బహ్రైచ్‌లోని మధుర వంతెన సమీపంలో అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.  

ఇది కూడా చదవండి: ప్రైవేట్ భాగంలో దురద రాకుండా ఉండటానికి ఇలా చేయండి

ఇక హత్యకు సంబంధించిన అసలు కథ పెళ్లికోసమేనని బయటపెట్టారు. సజరూన్ తనను వివాహం చేసుకోమని ఆసిఫ్ ను పట్టుబట్టింది. అయితే అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలున్న సజరూణ్ ను మ్యారేజు చేసుకునేందుకు ఆసిఫ్ ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. వివాహం చేసుకోలేనని చెప్పినా వినకుండా విసిగించడంతో వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు. అతను బైక్ చైన్ సాకెట్ తో ఆ ఆయుధాన్ని తయారు చేశాడు. మార్చి 6న సజరూన్ తనను కలవాలని పట్టుబట్టి ఆమెను వాకింగ్ కు తీసుకెళ్తానని చెప్పి బహ్రైచ్‌లోని నాన్‌పారా ప్రాంతంలోని అదే కాలువ ఒడ్డుకు తీసుకెళ్లాడు. అతను అప్పటికే సలార్ సినిమాలో లాంటి ఆయుధాన్ని తనతో తెచ్చుకున్నాడు. ఎవరులేని సమయంలో ఆమె తల నరికివేసాడు. సాక్ష్యాలు దొరకకుండా చేయడానికి ఆమె చేతులను కూడా నరికివేశాడు. వేరు వేరు ప్యాకెట్లలో ప్యాక్ చేసి వాటిని దగ్గరలోని అడవిలోకి విసిరేసాడు. తన నేరం జరిగిన ప్రదేశం నుండి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో దొరికింది. ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు పోలీసులు. 

ఇది కూడా చదవండి: ఊబకాయం నుండి బయటపడాలంటే మామిడి పండ్లు బెటరా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు