/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-4-6.jpg)
Married woman kills husband over illicit relationship with son-in-law
Crime: ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్ జిల్లాలో ఓ దారుణం జరిగింది. ఒక మహిళ తన సొంత మేనల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకోవడం కలకలం రేపింది. అంతేకాదు ఈ విషయం తన మామకు తెలిసిందని, ఎలాగైనా మామ అడ్డుతగిలించుకోవాలని ప్లాన్ చేసి దారుణానికి ఒడిగట్టారు. మరో స్నేహితుడితో కలిసి అతన్ని హతమార్చగా ఈ ఘటన జనాలను ఉలిక్కిపడేలా చేసింది.
గౌరవ్ బయటకు వెళ్లగానే రాసలీలు..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌరవ్, ప్రీతిలకు కొంతకాలంక్రితం పెళ్లైంది. అయితే ప్రీతి ఇటీవల తన మేనల్లుడు నిమిష్ తో సన్నిహితంగా ఉంటోంది. అది కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. గౌరవ్ బయటకు వెళ్లగానే ఇద్దరు రాసలీలల్లో తేలిపోయేవారు. బటయకూడా తిరిగారు. ఈ క్రమంలోనే గౌరవ్ కు అనుమానం వచ్చి ప్రీతిని హెచ్చరించాడు. దీంతో ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని అల్లుడితో కలిసి ప్లాన్ చేసింది. అయితే నిమిష్ తన స్నేహితుడు తరుణ్ తో కలిసి గౌరవ్ మర్డర్ కు ప్లాన్ చేశాడు. గౌరవ్ ను ముగ్గురు కలిసి చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. జనవరి 30న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి మరణించినట్లు పోలీసులకు సమాచారం అందగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది.
గౌరవ్ రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని గొంతు కోసి చంపినట్లు పోస్ట్ మార్టమ్ రిపోర్టులో బయటపడింది. దీంతో అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు భార్య కాల్ రికార్డ్స్ పరిశీలించారు. తన మేనల్లుడితో అక్రమ సంబంధం ఉందని, అందుకే గౌరవ్ ను హతమార్చారని గుర్తించారు. ప్రీతి, నిమిష్, అతని స్నేహితుడిని అరెస్టు చేశారు. ఒక వాహనం, మొబైల్ ఫోన్, పిస్టల్, కార్ట్రిడ్జ్‌లను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Chiranjeevi: తల్లి అంజనాదేవికి అనారోగ్యం.. చిరంజీవి సంచలన ప్రకటన!