Online Betting: ఆన్‌లైన్ గేమ్ మోసానికి 17 ఏళ్ల బాలుడు బలి.. ఫోన్‌కు ఫోరెన్సిక్ పరీక్ష!

ఆన్‌లైన్ గేమ్ బెట్టింగ్ మోసానికి 17 ఏళ్ల బాలుడు బలయ్యాడు. తమిళనాడులోని మధురైకి చెందిన హరిహరసుధన్ తమ బిల్డింగ్‌పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫోన్‌ ఫోరెన్సిక్ పరీక్షకు పంపించి పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

New Update
Online betting suicide family

online game betting fraud 17-year-old boy suicide

Online Betting: ఆన్‌లైన్ గేమ్ బెట్టింగ్ బాలుడి ప్రాణం తీసింది. కొంతకాలంగా ఫోన్‌కు బానిసైన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న పిల్లవాడు నెమ్మదిగా ఆన్ లైన్ గేమ్ ఆడటం మొదలపెట్టాడు. అలా అప్పుల్లో కూరుకుపోవడంతోపాటు తీవ్ర ఒత్తిడికి లోనై చివరకు ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపుతోంది. ఈ ఘటన తమిళనాడులోని మధురైలో జరగగా పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  

కాలేజీ మానేసి గేమ్ పై ఫోకస్.. 

తమిళనాడులోని మధురైలో నివాసం ఉంటున్న మణికంఠం కొడుకు 17 ఏళ్ల హరిహరసుధన్ 11వ తరగతి వరకు చదువు పూర్తి చేశాడు. అతను కొంతకాలంగా ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసయ్యాడు. దాని కారణంగా మానసిక సమస్యలతో బాధపడుతూ సంవత్సర కాలంగా అతను కాలేజీకి వెళ్లడం మానేసి ఇంట్లోనే ఉన్నాడు. అతను ఈ ఏడాది సమయమంతా ఈ గేమ్‌లను ఆడుతూ గడిపాడు. తల్లిదండ్రులు చెప్పినా వినకుండా దానిలో నిమగ్నమయ్యాడు. అలా డబ్బులు పొగొట్టుకున్న హరి.. అవమానంగా భావించి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో మొబైల్ వ్యసనమే దీనికి కారణమని భావిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

Also Read :  హిందీలో 'ఛావా' కలెక్షన్ల జోరు.. 'బాహుబలి-2' రికార్డ్ బ్రేక్! ఎన్ని కోట్లంటే

జాగ్రత్తగా చూసుకోమంటూ..

ఇక రెండు రోజుల క్రితం ఇంటి పైకప్పు నుండి పెద్ద శబ్దం వినబడగానే హరి పేరెంట్స్ ఉలిక్కిపడ్డారు. బటయకెళ్లి చూసేసరికి హరిహరసుధన్ తన ఫోన్ పగలగొట్టి పైకప్పు మీద నుండి దూకినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఇక తన ప్రాణాలను తీసుకునే ముందు ఒక స్నేహితుడికి మెసేజ్ పంపాడు. 'నా తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకో' అని అతన్ని కోరాడు. తల్లిదండ్రులు చెప్పే పలు కారణాలను బట్టి అతను నిజంగా ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసయ్యాడో లేక ఆత్మహత్య వేక ఇంకేదైన కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్షకు పంపించాం. ఈ కేసు విచారణ ప్రక్రియ 3-4 నెలలు పట్టవచ్చని పోలీసు వర్గాలు తెలిపాయి.

Also Read: రెచ్చిపోయిన పోలీసులు.. రచ్చ చేశారంటూ యువతకు గుండ్లు కొట్టించి ఊరేగింపు

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap Crime: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మసిస్ట్ నాగాంజలి మృతి!

లైగింక వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మాసిస్ట్ నాగాంజలి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.దీపక్‌ అనే వ్యక్తి వేధించడం వల్లే తాను చనిపోతున్నట్లు నాగాంజలి సూసైడ్‌ నోట్‌ రాసింది.

New Update
rjy

rjy

కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మసిస్ట్ నాగాంజలి మృతి చెందింది. 12 రోజులుగా చావుబతుకుల మధ్య పోరాడుతూ వెంటిలేటర్ పైనే ఉన్న ఫార్మాసిస్ట్.. శుక్రవారం తుది శ్వాస విడిచింది. నాగాంజలి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో ఏజీఎంగా పనిచేస్తున్న దీపక్ లైంగిక వేధింపుల వల్ల పార్మాసిస్ట్ నాగాంజలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిందితుడు దీపక్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులు అనంతలక్ష్మి, దుర్గారావులు కోరుతున్నారు.

Also Read: Telangana: మరో 48 గంటలు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్..  !

అసలేం జరిగిందంటే...

కాగా.. గత నెల 23న తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కిమ్స్‌ బొల్లినేని ఆసుపత్రిలో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న వికాస్‌ ఫార్మసీ కళాశాల ఫార్మ్‌ డి ఫైనలియర్‌ విద్యార్థిని నాగాంజలి (23) ఆత్మహత్యాయత్నం తీవ్ర సంచలనం రేపింది. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మం డలం రౌతుగూడెం గ్రామానికి చెందిన నాగాంజలి రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి వద్ద వికాస్‌ ఫార్మసీ కళాశాలలో ఫార్మ్‌ డి పైనలియర్‌ చదువుతోంది. అయితే గత నెలలో నాగాంజలి ఆస్పత్రిలోనే ఎనస్థీషియా అత్యధిక డోస్‌ ఇంజక్షన్‌ తీసుకుంది. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే గమనించిన సహచరులు ఐసీయూలోకి తరలించి చికిత్స అందజేశారు. ఈ క్రమంలో నాగాంజలి డైరీలో రాసుకున్న సూసైడ్ లెటర్ బయటకు రావడంతో తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థినిలు రాజమహేంద్రవరంలో ఆందోళనకు దిగారు.

Also Read: Gujarat: వారం క్రితమే నిశ్చితార్థం...ఇంతలోనే ప్రమాదం..కన్నీళ్లు పెట్టిస్తున్న గుజరాత్‌ జెట్‌ పైలెట్‌ మృతి!

ఆసుపత్రిలో మెడికల్‌ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న దీపక్‌ వేదింపుల వల్లే నాగాంజలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితురాలు సూసైడ్ నోట్‌లో రాసింది. అంతే కాకుండా సూసైడ్ నోట్‌లో దీపక్‌ వల్ల తాను అనుభవించిన బాధలను వివరించింది. ఓ ఫంక్షన్‌కు రెడ్ శారీ కట్టుకుని వెళ్లడంతో వాడి కళ్లలో పడ్డానని.. తనను మోసం చేశాడని, తనకు మరణం తప్ప వేరే దారి లేదని, తన గురించి బెంగపెట్టుకోవద్దని, తాను మరణించాక అవయవాలు దానం చేయాలి అంటూ ఫార్మాసిస్ట్ సూసైడ్‌ నోట్‌ రాసిమరీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు దీపక్‌ ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నాగాంజలి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Also Read: Trump: ట్రంప్ నిర్ణయాలు.. భారత విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులపై తీవ్ర ప్రభావం..!

Also Read:  Ap Weather Report: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!

 student | suicide | rajamahendravaram | east-godavari | westgodavari | crime | ap | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు