BIG BREAKING: నల్గొండలో ఘోరం.. మాజీ సర్పంచ్‌ను గొడ్డళ్లతో నరికిన దుండగులు!

తెలంగాణలో మరో దారుణ హత్య జరిగింది. నల్గొండ జిల్లా మిర్యాల గ్రామం మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్యపై గుర్తుతెలియని దుండగులు గొడ్డళ్ళతో దాడి చేశారు. ఆయన తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు. పాత కక్షలే కారణమని పోలీసుల అనుమానిస్తున్నారు. 

New Update
nalgonda murder

Nalgonda Miryala village Former Sarpanch Menchu ​​Chakraya Goud murdered

BIG BREAKING: తెలంగాణలో మరో దారుణ హత్య జరిగింది. నల్గొండ జిల్లా మిర్యాల గ్రామం మాజీ సర్పంచ్ మెంచు చక్రయ గౌడ్‌పై గుర్తుతెలియని దుండగులు గొడ్డళ్ళతో దాడి చేశారు. చక్రయ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో మృతి చెందారు. పాత కక్షలే కారణమని పోలీసుల అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

Also Read :  Kumbh Mela: కొంపముంచిన కుంభమేళా పబ్లిసిటీ.. ఇప్పుడు రూ.12.8 కోట్ల ట్యాక్స్ కట్టేదెలా..?

ఇదిలా ఉంటే.. నకిలీ ఎస్ఐలుగా ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హుజూర్నగర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  నల్గొండ జిల్లా నిడమనూరుకు చెందిన ప్రశాంత్, అక్షిత్, నల్గొండకు చెందిన ఇరాన్, వాజిద్  ఏపీలోని కుప్పం ఎస్ఐ ఫొటోను డీపీగా పెట్టుకుని బెదిరింపులకు దిగుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా  హుజూర్ నగర్ లో ఓ గోల్డ్ షాపు యజమానికి ఫోన్ చేసి నువ్వు దొంగల నుంచి బంగారం కొన్నావని... త్వరలో నువ్వు జైలుకు వెళ్తావ్ అంటూ బెదిరించారు. 

Also read: Sunita Williams : భూమి మీదకొచ్చాక నడవలేని పరిస్థితిలో సునీతా విలియమ్స్.. చాలా హెల్త్ ప్రాబల్స్

అలా చేయకుండా ఉండాలంటే రూ. 10 వేలు వెంటనే పంపించాలని డిమాండ్ చేశారు. భయపడిపోయిన ఆ గోల్డ్ షాపు యజమాని వారికి రూ.10 వేలు పంపాడు. ఆ తరువాత అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా..  పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను పట్టుకున్నారు.  వారి నుంచి రెండు బైక్ లు, నాలుగు సెల్ ఫోన్లు 24 వేల 900 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు