/rtv/media/media_files/2025/02/12/WObLXQHUqdK0vk24suvJ.jpg)
khammam Photograph: (khammam)
Khammam Crime: ఓ వివాహిత తన సుఖం కోసం చేసిన పని రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. కట్టుకున్నవాడు ఉండగానే మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోగా ఈ వ్యవహారం పంచాయితీ వరకు వెళ్లింది. దీంతో భర్తను వదిలేసి ప్రియుడితోనే వెళ్తానని చెప్పిన మహిళకు ఆ గ్రామ పెద్దమనుషులు నష్టపరిహారం ఇవ్వాలని తీర్పు ఇచ్చారు. రూ.3 లక్షలు ఇచ్చి నచ్చినవాడితో వెళ్లాలని ఆదేశించారు. దీంతో అంత డబ్బు ఇచ్చే స్థోమత లేకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ పెద్ద మనుషులు వినకపోగా మరింత ఒత్తిడి చేయడంతో ప్రేమికులిద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తెలంగాణలోని ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకుల గూడెంలో జరిగింది.
పరువు తీసినందుకు నష్టపరిహారం..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుపాకుల గూడెంకు చెందిన ఆలం అశ్విని (23)కి అదే గ్రామానికి చెందిన ఆలం కిరణ్‌తో 5 క్రితం పెళ్లయింది. అశ్వినికి కిరణ్ బంధువు కాగా వరుసకు మరిది అవుతాడు. అయితే కొంతకాలం తర్వాత ఆలం స్వామి (25)తో అశ్విని అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇటీవల స్వామితో కలిసి అశ్విని ఇంట్లోంచి వెళ్లిపోయి మరో దగ్గర కాపురం పెట్టారు. దీంతో కిరణ్ ఊర్లో పంచాయితీ పెట్టించి అశ్విని తనకు అవసరం లేదన్నాడు. కానీ తన పరువు తీసినందుకు రూ.3లక్షల నష్టపరిహారం కావాలని చెప్పాడు.
ఈ క్రమంలోనే పెద్ద మనుషులు పంచాయితీలో కిరణ్‌కు అశ్విని చెల్లించాల్సిందేనని తీర్మాణం చేశారు. దీంతో తమ దగ్గర అంత డబ్బు లేదని, తాము ఇవ్వలేమని ఆందోళన చెందారు. అయినా వినకుండా ఆదేశించడంతో మనస్తాపానికి గురైన స్వామి, అశ్విని ఇంట్లో పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు గమనించిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Kamal Haasan : ఫిక్స్ .. రాజ్యసభకు కమల్ హాసన్!