Dhee Dancer sucide: ఐదేళ్లు వాడుకుని మొహం చాటేసిన ప్రియుడు.. ఆత్మహత్య చేసుకున్న ఢీ డ్యాన్సర్!

ఖమ్మంలో దారుణం జరిగింది. ఢీ డ్యాన్సర్ అభి తనను 5ఏళ్లు వాడుకుని మోసం చేశాడంటూ ఢి డ్యాన్సర్ కావ్యకళ్యాణి ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. సెల్ఫీ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. అభిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

New Update
dhee dancer

dhee dancer

Dhee Dancer sucide: తెలంగాణలో మరో యువతి ప్రియుడి మోసానికి బలైంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి కొంతకాలం సహజీవనం చేసిన యువకుడు మరొకరితో మ్యారేజ్‌కు సిద్ధమయ్యాడు. దీంతో అవమానంగా భావించిన సదరు యువతి తన ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడింది. అయితే వీరిద్దరూ ఢీ డ్యాన్సర్స్ కావడంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.   

రహస్యంగా పెళ్లి చేసుకుని..

ఖమ్మం జిల్లా బ్యాంక్ కాలనీకి చెందిన కావ్యకళ్యాణి (24), పొన్నెకల్‌కు చెందిన అభి అనే యువకుడితో ప్రేమలో పడింది. వీరిద్దరూ ఢీ డ్యాన్స్ ప్రొగ్రామ్ లో కంటెస్టెంట్ గా ఉన్నప్పుడే ప్రేమ చిగురించింది. అయితే తనను రహస్యంగా పెళ్లి చేసుకున్న అభి.. మరో యువతితో పెళ్లికి సిద్ధమైనట్లు ఇటీవల గుర్తించింది. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన కావ్యకళ్యాణి సూసైడ్ చేసుకుంటూ సెల్ఫీ వీడియో తీసింది. 

Also Read: హిందూ అమ్మాయితో పెళ్లి.. ముస్లిం వ్యక్తిని చితకబాదిన లాయర్లు!

5 ఏళ్లు ఒకే గదిలో..

'నేను చనిపోతున్నా. నా చావుకి కారణం అభి. 5 సంవత్సరాలు నన్ను ప్రేమించి పెళ్ళి చేసుకొని ఇంటికి తీసుకెళ్లాడు. నగరంలోని మామిల్లగూడెం లోని సాయిబాబా గుడి సమీపంలో నివాసం ఉన్నాం. ఇప్పుడు నన్ను వదిలేసి మరో అమ్మాయిని తీసుకొచ్చుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని, నన్ను వెళ్లిపొమంటున్నాడు' అంటూ ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.  ఆమె మృతదేహం ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో ఉండగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ ఘటన తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఖమ్మం పోలీసులు నిందితుడు అభిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.

Also Read: ఈశా ఫౌండేషన్‌కు బిగ్‌ రిలీఫ్‌.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం

Advertisment
Advertisment
Advertisment