Khammam: ఐ లవ్ యూ బంగారం తిన్నావా.. రమ్మంటావా: లెక్చరర్ సైకో చేష్టలు!

ఖమ్మంలో దారుణం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికను ప్రేమ పేరిట లెక్చరర్ వేధింపులకు గురిచేయడం కలకలం రేపుతోంది. ఐ లవ్ యూ బంగారం. తిన్నావా, పడుకున్నావా, రమ్మంటావా అంటూ సైకో చేష్టలకు పాల్పడిన హరిశంకర్‌ను అరెస్ట్ చేసి ఫొక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. 

New Update
khammam case

khammam case Photograph: (khammam case)

Khammam: ఖమ్మంలో మరో దారుణం జరిగింది. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినిని ప్రేమ పేరిట లెక్చరర్ వేధింపులకు గురిచేసిన ఘటన కలకలం రేపుతోంది. ఐలవ్ యూ బంగారం తిన్నావా, పడుకున్నావా, రమ్మంటావా అంటూ సైకో చేష్టలకు పాల్పడిన హరిశంకర్‌ను అరెస్ట్ చేసి ఫొక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. 

కొంతకాలంగా అసభ్య ప్రవర్తన..

ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని గాంధీచౌక్ వద్ద ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ గా కె.హరిశంకర్ విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఎస్సీ బాలికల వసతి గృహంలో ఆశ్రయం ఉంటూ ఈ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినితో కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయంలో పెద్దగా పట్టించుకోనట్లే వ్యవహరించింది బాలిక. దీంతో మరింత రెచ్చిపోయిన శంకర్ టార్చర్ చేస్తూనే ఉన్నాడు.

Also read :  గురుమూర్తి కేసులో బిగ్ ట్విస్ట్.. DNA టెస్టులో బయటపడిన సంచలనాలు!

దీంతో లెక్చరర్ వేధింపులకు భయపడి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది విద్యార్థిని. 'ఐలవ్ యూ బంగారం. తిన్నావారా.‌ పడుకున్నావా‌. ఇప్పుడు రమ్మంటావా' అంటూ తనకు  ఫోన్ కాల్స్, మెసేజెస్ చేస్తున్నాడని చెప్పింది. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ చేస్తే వెంటనే రెస్పాండ్ అవ్వాలని బెదిరింపులకు గురిచేస్తున్నట్లు ఆందోళన చెందింది. ఈ విషయాన్ని ఆమె పేరెంట్స్ కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లగా లెక్చరర్ వ్యవహారంపై నిఘా పెట్టి బాగోతం బయటపెట్టారు. 

Also read :  ఏపీలో మరో కొత్త జిల్లా.. చంద్రబాబు కీలక ప్రకటన!

ఈ క్రమంలోనే శంకర్ పిచ్చి చేష్టలపై జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అరుణ్ కుమార్ తమకు కంప్లైంట్ ఇచ్చారని ఖమ్మం త్రీటౌన్ పోలీసులు తెలిపారు.  దంతో లెక్చరర్ హరిశంకర్ పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అంతర్గత విచారణకు ఆదేశించారని, వెంటనే లోతుగా విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు అందజేసినట్లు ఖమ్మం జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి రవిబాబు, కళాశాల ప్రిన్సిపాల్ అరుణ్ కుమార్ తెలిపారు. విద్యార్థినిపై వేధింపులకు పాల్పడిన కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ ను  ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వ్యులు జారీ చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Rape case: మైనర్ బాలికను రేప్ చేసిన బ్యాడ్మింటన్ కోచ్.. ఫోన్‌లో ట్రైనీల న్యూడ్ ఫొటోలు!

బెంగళూర్‌లో మరో దారుణం జరిగింది. మైనర్ బాలికపై బ్యాడ్మింటన్ కోచ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అలాగే BGLRలో 8మంది ట్రైనీ అమ్మాయిల న్యూడ్ ఫొటోలు తీసినట్లు గుర్తించిన పోలీసులు తమిళనాడుకు చెందిన సురేశ్ బాలాజీని అరెస్ట్ చేశారు. 

New Update
rape case bg

Bengaluru Badminton coach sexually assaults minor girl

Rape case: బెంగళూర్‌లో మరో దారుణం జరిగింది. మైనర్ బాలికపై  బ్యాడ్మింటన్ కోచ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. BGLRలో 8మంది ట్రైనీ అమ్మాయిల న్యూడ్ ఫొటోలు తీసినట్లు గుర్తించి పోలీసులు సురేశ్ బాలాజీని అరెస్ట్ చేశారు. 

ట్రైనీల న్యూడ్ ఫొటోలు..

ఈ మేరకు తమిళనాడుకు చెందిన 26 ఏళ్ల సురేశ్ BGLRలో కోచింగ్ సెంటర్ లో బాడ్మింటన్ కోచ్ గా పనిచేస్తున్నాడు. అయితే 16 ఏళ్ల బాలిక రెండేళ్ల క్రితం ట్రైనీగా చేరింది. ఆమెను బలవంతంగా లోబరుచుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికీ చెప్పొద్దని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అతని ఫోన్లో మరో 8మంది ట్రైనీల న్యూడ్ ఫొటోలు ఉన్నట్లు గుర్తించారు. ఈ బాలికతోపాటు మరికొంతమంది అమ్మాయిలను కూడా అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వస్తుండటం సంచలనం రేపుతోంది. 

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

అయితే బాలిక అమ్మమ్మ ఫోన్ చెక్ చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కోచ్ తరచుగా బాలికను ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు బయటపడింది. కోచ్‌ సురేష్‌తో చేసిన చాటింగ్‌లో బాలిక తన న్యూడ్‌ పిక్స్‌ను అతనికి పంపినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఆమెను నిలదియగా అసలు విషయం బయటపెట్టింది. కానీ బాలిక మాత్రం కోచ్‌ సురేష్‌తో తానే అక్రమం సంబంధం పెట్టుకున్నట్లు చెప్పడంతో కేసు మరింత సంచలనంగా మారింది.

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

bengalore | rape-case | minor-girl | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment