AP Crime: వివాహితకు జైలర్ లైంగిక వేధింపులు.. న్యూడ్ కాల్స్ చేసి అది కావాలంటూ!

ఏపీలో ఓ వివాహితపై జైలర్ లైంగిక వేధింపులకు పాల్పడటం సంచలనం రేపుతోంది. న్యూడ్ కాల్స్ చేస్తూ టార్చర్ చేస్తున్నాడంటూ బాధితురాలు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో జైలర్ సుబ్బారెడ్డిపై కేసు నమోదు చేశారు. 

New Update
jailae call

jailae call Photograph: (jailae call)

AP Crime: ఏపీలో ఓ వివాహితపై జైలర్ లైంగిక వేధింపులకు పాల్పడటం సంచలనం రేపుతోంది. న్యూడ్ కాల్స్ చేస్తూ టార్చర్ చేస్తున్నాడంటూ బాధితురాలు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో జైలర్ సుబ్బారెడ్డిపై కేసు నమోదు చేశారు. 

ఇంటినుంచి పరార్..

అయితే విచారణకు హాజరుకాలని ఆదేశించడంతో⁠ సుబ్బారెడ్డి ఇంటినుంచి పరారయ్యాడు. ఎవరికంటపడకుండా తప్పించుకు తిరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ⁠జైళ్ల శాఖ డీజీపీకి విశాఖ సీపీ శంఖ బ్రతబాగ్చి లేఖ రాశారు. జైలర్ ఆచూకీ గుర్తించి తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రప్రజలతోపాటు పోలీస్, జైళ్ల శాఖలో చర్చనీయాశమవుతోంది. 

Also Read: ఆర్మీలో డాక్టర్ టెర్రరిస్ట్ గ్రూప్‌ మాస్టర్ మైండ్‌గా ఎందుకు మారాడు..?

ఈ వివాదంపై RTVతో మాట్లాడిన విశాఖ సీపీ శంఖబ్రత  బాగ్చి.. 'గత నెల పార్వతి పురం మన్యం జిల్లాకి చెందిన బాధితురాలు మాకు ఫిర్యాదు చేశారు. జైలర్ తనకు న్యూడ్ వీడియో కాల్ చెయ్యాలి అని ఇబ్బంది పెడుతున్నట్లు తెలిపారు.⁠ డబ్బులు ఇస్తాను.. నేను చెప్పినట్టు చెయ్యండి అంటూ వేధింపులు వచ్చినట్టు చెప్పారు. జైలర్ సుబ్బారెడ్డి బాధితురాలికి న్యూడ్ వీడియో లు ఫోటోలు పంపినట్టు మా వద్ద ఆధారాలు ఉన్నాయి. బాత్ రూం లోకి వెళ్లి న్యూడ్ ఫోటోలు పంపాలని బాధితురాలిపై వేధింపులుక పాల్పడ్డాడు. ప్రిజన్స్ డీజీపీకి జైలర్ సుబ్బారెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని లేఖ రాశాం. విశాఖలో పనిచేసే సమయంలో బాధితురాలు జైలర్ సుబ్బారెడ్డికి పరిచయం ఏర్పడినట్లు తెలిసింది' అని తెలిపారు. 

Also Read :  హనుమాన్ జయంతి నాడు ఇలా చేయండి.. మీ శని, దరిద్రం పరార్!

ఇదిలా ఉంటే.. ఆర్థిక ఇబ్బందులతో తండ్రీకొడుకులు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన కృష్ణాజిల్లా పెనమలూరులో వెలుగుచూసింది. అయితే సాయి ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఏదో వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కాగా, కరోనా తర్వాత ఆయన వ్యాపారం తీవ్రంగా నష్టపోయింది. పలు చోట్ల అప్పులు చేయవల్సి వచ్చింది. దీంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయాయి. అప్పుల నుంచి బయటపడలేకపోయిన సాయి ప్రకాష్ ఎంతో విషాదకరంగా తనువు చాలించాడు. సైనైడ్ కలిపిన ఐస్ క్రీమ్ తిని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తనతో పాటు కొడుకుకు కూడా అది తినిపించాడు. చనిపోయేముందు కుటుంబ సభ్యులకు సారీ అంటూ  మెసేజ్ పంపాడు. భర్త, కొడుకు మరణంతో భార్య లక్ష్మీదేవి, ఇతర కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. 

Also Read: TGPSC మరో కీలక నిర్ణయం.. ఇక నుంచి 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలన!

Also Read :  వివాహితకు జైలర్ లైంగిక వేధింపులు.. న్యూడ్ కాల్స్ చేసి అది కావాలంటూ!

today telugu news | women | sexcual harrisement | police | latest-telugu-news | andhra-pradesh-crime-reports | telugu crime news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Himachal Pradesh Accident : పెళ్లింట తీవ్ర విషాదం.. కారు లోయలో పడి ఐదుగురి మృతి

పెళ్లింట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అదుపు తప్పి కారు లోయలో పడటంతో ఐదుగురి మృతి చెందారు. ఈ దుర్ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ జిల్లాలో పాండో ఆనకట్ట సమీపంలోని బఖ్లి రోడ్డుపై జరిగింది. మృతుల్లో ఎనిమిది నెలల చిన్నారి కూడా ఉన్నాడు.  

New Update
HP accident

HP accident

పెళ్లింట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అదుపు తప్పి కారు లోయలో పడటంతో ఐదుగురి మృతి చెందారు. ఈ దుర్ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ జిల్లాలో పాండో ఆనకట్ట సమీపంలోని బఖ్లి రోడ్డుపై జరిగింది. మృతుల్లో ఎనిమిది నెలల చిన్నారి కూడా ఉన్నాడు.  

తమ్ముడి వివాహం అయిపోయాక 

మృతులను చాచియోట్ తహసీల్‌లోని తరౌర్ గ్రామానికి చెందిన రమేష్ చంద్ కుమారుడు దునిచంద్ (33), తరౌర్ గ్రామానికి చెందిన దునిచంద్ భార్య కాంతా దేవి (28), వారి కుమార్తె కింజల్ (8 నెలలు), చాచియోట్ తహసీల్‌లోని నౌన్ గ్రామానికి చెందిన థాలియా రామ్ కుమారుడు దహ్లు రామ్ (52), నేపాల్ నివాసి మీనా దేవి (30)గా గుర్తించారు. దునిచాంద్ తమ్ముడి వివాహం అయిపోయిన తరువాత కారులో ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.  

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, పాండో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో కారు పూర్తిగా దెబ్బతింది. ప్రస్తుతం, SDRF, CISF, పాండో అవుట్‌పోస్ట్ బృందాలు మృతదేహాలను బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నాయి

Advertisment
Advertisment
Advertisment