Hyderabad: దుర్గం చెరువులో దూకి మహిళ ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో తీసి!

హైదరాబాద్ దుర్గం చెరువులో దూకి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఆమెను కాప్రాలోని ఎల్లారెడ్డిగూడకు చెందిన దుర్గామాధవిగా పోలీసులు గుర్తించారు. భర్త ప్రభు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని వెలికి తీశారు. ఆమె చావుకుగల కారణం తెలియాల్సివుంది.

New Update
durgam cheruvu

Woman sucide in Durgam cheruvu

Hyderabad: హైదరాబాద్ దుర్గం చెరువులో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. కాప్రాలోని ఎల్లారెడ్డిగూడకు చెందిన దుర్గామాధవి ఈ దారుణానికి పాల్పడింది. భర్త ప్రభు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని వెలికి తీశారు. అయితే గురువారం రోజే ఆమె సూసైడ్ చేసుకోబోతున్నట్లు తన ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసుకుని ఇంటినుంచి వెళ్లిపోయిందని, అచూకి తెలియట్లేదంటూ ప్రభు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 

దుర్గం చెరువులో మృతదేహాం..

దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు శనివారం దుర్గం చెరువులో లభించిన మృతదేహాన్ని పరిశీలించగా ఆమె దుర్గా అని గుర్తించారు. మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెలిపారు. ఇక దుర్గ మరణానికి కారణమేమిటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. 

ఇది కూడా చదవండి: Girls Hostel: గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ ఇష్యూ.. వెలుగులోకి సంచలనాలు!

నాకు లేడనే బెంగతో..

ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ లాలాపేటలో విషాదకర ఘటన జరిగింది. లక్ష్మీ, ఆమె కుమారుడు అభినవ్ గత ఎనిమిది ఏళ్లుగా సికింద్రాబాద్‌లోని లాలాపేటలో ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయితే తల్లి లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో తన తల్లి మరణాన్ని తట్టుకోలేని కొడుకు అభినవ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఏ గదిలో అయితే తన తల్లి చనిపోయిందో.. అదే గదిలో అభినవ్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా ఇంట్లో ఇద్దరి మృతదేహాలు ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా పోలీసులు, స్థానికులు ఉలిక్కి పడ్డారు.

ఇది కూడా చదవండి: P Kishor: పాట్నాలో ప్రశాంత్‌ కిశోర్‌ నిరసన.. లగ్జరీ వ్యానుపై విమర్శలు!


అనంతరం అభినవ్ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. ఆ నోట్‌ ప్రకారం.. ‘‘నాకు, అమ్మకు గత కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. నాన్న కూడా లేరు. మా బంధువుల గురించి వెతకొద్దు. నన్ను క్షమించండి’’ అంటూ ఆ నోట్‌లో రాసుంది. అయితే ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన లాలాగూడ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Telangana: విషాదం.. ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి.. !

హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో మంగళవారం ఆయసంతో ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తికి వైద్యులు ఎక్స్పైరీ అయిన ఇంజక్షన్‌ను ఇచ్చారు. అది వికటించడంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. దీంతో మృతదేహాంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

New Update
Injuction

Expired Injuction

హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇంజక్షన్ వికటించడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇంతకీ అసలేం జరిగిందో తేలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. కార్వాన్ బాంజవాడికి చెందిన ఐలయ్య(53) మంగళవారం మధ్యాహ్నం ఆయాసంతో బాధపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని రింగ్‌రోడ్డు సమీపంలో హైకేర్‌ ఆస్పత్రికి తరలించారు. 

Also Read: మరో భయంకరమైన భార్య మర్డర్.. ఛార్జర్ వైర్‌తో గొంతు కోసి, పిల్లలను గదిలో బంధించి!

ఆ తర్వాత వైద్యులు అతడికి పరీక్షలు చేసి ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అతడి ఆరోగ్యం క్షీణించింది. దీంతో అక్కడున్న వైద్యులు తమ ఆస్పత్రిలో గుండె సంబంధిత వైద్యులు లేరని.. వెంటనే మరో ఆస్పత్రికి తరలించాలని సూచనలు చేశారు. అయితే కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా.. అప్పటికే ఐలయ్య మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు ఇలా ఎలా జరిగిందని వైద్యులను నిలదీశారు. 

Also Read: పశ్చిమ బెంగాల్‌లో హింస వెనుక ముఖ్యమంత్రి కుట్ర : కేంద్ర మంత్రి

చివరికి ఐలయ్యకు ఇచ్చిన ఇంజక్షన్లను పరిశీలించారు. అయితే ఆ ఇంజక్షన్ మార్చి నెలలోనే ఎక్స్పైరీ అయినట్లుగా గుర్తించారు. గడువు ముగిసినప్పటికీ కూడా ఇంజక్షన్ ఇవ్వడం ఏంటని వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇంజక్షన్ ఇవ్వడం వల్లే ఐలయ్య మృతి చెందాడని వాగ్వాదానికి దిగారు. దీంతో మృతదేహంతోనే ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుని విచారణ చేస్తున్నారు. ఇదిలాఉండగా.. గతంలో కూడా ఇలా ఇంజక్షన్‌లు వికటించి రోగులు మృతి చెందిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 

Also Read: సూర్యాపేట జిల్లాలో కూలీల ఆటో బోల్తా.. స్పాట్‌లో పదిమంది!

rtv-news | telangana 

Advertisment
Advertisment
Advertisment