/rtv/media/media_files/2025/03/15/pqdx36Mn7r5BxH2muwBL.jpg)
Guntur Young woman attack on young man with petrol
AP Crime: ఏపీలో మరో దారుణం జరిగింది. పల్నాడు జిల్లా ఉయ్యందనలో చిరంజీవి అనే యువకుడిపై శ్రీలక్ష్మీ అనే యువతి పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడనే కోపంతో దాడికి పాల్పడింది. చిరంజీవి ఆస్పత్రిలో చికిత్స పొందతున్నాడు.
తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని..
అయితే మంటలు అంటుకోవడంతో అతని వీపు కాలిపోయింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే సత్తెనపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం బాధితుడిని సత్తెనపల్లి నుంచి గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. దాడికి పాల్పడిన శ్రీలక్ష్మీపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఇక ఈ ఘటన గురించి స్పందించిన శ్రీలక్ష్మీ.. చిరంజీవి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని చెప్పింది. క్యారెక్టర్ గురించి నిందలు వేస్తున్నాడని, ఎన్నిసార్లు హెచ్చరించినా చిరంజీవి పద్ధి మార్చుకోకపోవడంతో పెట్రోల్ పోసి నిప్పంటించి నట్లు తెలిపింది. ఈ ఘటన గ్రామంలో సంచలనంగా మారింది.ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
ఇదిలా ఉంటే.. తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. భోజనం చేస్తుండగానే ఓ యువకుడిని అతి దారుణంగా హత్య చేశారు. వెనక నుంచి దాడి చేసి కత్తులతో అతని గొంతుకోశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని సరిగా చూసుకోవడం లేదని సొంతమామ, బావమరిదే ఈ దారుణానికి ఒడిగట్టారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లకు చెందిన పేరం శివ(27)తన ఇంటి పక్కనే ఉన్న రేగుల వెంకటేశు కుమార్తె భానుతో ప్రేమలో పడ్డాడు. నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల పాప కూడా ఉంది. అయితే కొంతకాలం వీరి సంసారం బాగానే ఉంది. అయితే ఇటీవల తరచూ దంపతుల మధ్య గొడవలు జరగుతున్నాయి. ఇరు కుటుంబ సభ్యులు మధ్యలో రాజీ చేస్తూ వస్తున్నారు. అయితే భోజనం చేస్తున్న శివను వెనక నుంచి పట్టుకుని బావమరిది, మిగిలిన వారు ఒక్కసారిగా కత్తులతో పీక కోసి అత్యంత దారుణంగా హతమార్చారు. దీంతో రక్తపు మడుగులో గిలగిలలాడుతూ శివ అక్కడికక్కడే మృతిచెందాడు. శివ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఇది కూడా చూడండి: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్
girl | boy | petrol | attack | guntur | telugu-news | today telugu news