Ap Crime: నిన్న కాకినాడ..నేడు కోనసీమలో దారుణం..కాలయములవుతున్న కన్నతండ్రులు!

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పిల్లి రాజు అనే వ్యక్తి తన ఇద్దరు బిడ్దలను కాలువలో తోశాడు. ఈ ఘటనలో కుమారుడు సందీప్ ప్రాణాలతో బయటపడగా.. కుమార్తె కారుణ్య నీళ్లల్లో మునిగి ప్రాణాలు కోల్పోయింది.

New Update
murder

murder

నిన్న కాకినాడ.. ఈరోజు కోనసీమ.. రేపు ఇంకొచోట.  కన్నబిడ్డలను కంటిపాపలను కాపాడాల్సిన కన్నతండ్రులే ఎందుకింత కర్కశంగా ప్రవర్తిస్తున్నాయి. బిడ్డల జోలికి వస్తే ఏ ప్రాణి కూడా ఊరుకోదు..అలాంటిది కష్టాలు వచ్చాయని, సరిగా చదవడం లేదని కన్నపిల్లలను అత్యంత కర్కశంగా ,మానవత్వం లేకుండా పొట్టనపెట్టుకుంటున్న మనుషులకు ఏంపోయే కాలం  వచ్చిందో తెలియడం లేదు.

Also Read: TTD: తిరుమల వెళ్లే భక్తులకు బ్యాడ్‌ న్యూస్‌..ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు!

నీ చేతి గీతలు, తలరాతలే నువ్వు మర్చుకోలేవు కానీ..బిడ్డల పాలిట మరణశాసనాన్ని రాసే హక్కు ఎవరిచ్చారయ్యా నీకు. ఇలాంటి అభిప్రాయాలు ఎన్నో కాకినాడ ఘటన తర్వాత వ్యక్తమవుతున్నాయి. కాకినాడ ఘటన ఇంకా కళ్ల ముందు కదలాడుతుండగానే కోనసీమలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

Also Read: Horoscope Today: నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!

ఇద్దరు పిల్లలను కాలువలో పడేసి ఓ తండ్రి కనిపించకుండా పోయాడు. కోనసీమలోని రామచంద్రపురం మండలం నెలపతిపాడు గ్రామ పరిధిలోని గణపతినగరం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పిల్లి రాజు అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలను కాలువలో తోసి చంపేయాలనుకున్నాడు. సందీప్(10),  కారుణ్య (6) అనే బాలికను కాలువలోకి తోసి హత్య చేశాడు. ఈ ఘటనలో సందీప్ ప్రాణాలతో బయటపడగా.. కారుణ్య తండ్రి కర్కశత్వానికి బలైపోయింది.

అయితే ఈ ఘటన తర్వాత పిల్లి రాజు కనిపించడం లేదు. దీంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని, లేదు అక్కడి నుంచి అదృశ్యమయ్యాడంటూ వార్తలు వస్తున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కనిపించకుండా పోయిన వారి తండ్రి పిల్లి రాజు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయితే అతను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చంటూ స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 

కాకినాడలోనూ ఇటీవల ఇలాంటి ఘటనే జరిగింది. కన్న బిడ్డలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే కాలయముడిగా మారాడు. అత్యంత క్రూరంగా కాళ్లూ చేతులు కట్టేసి, నీళ్ల బకెట్లలో తలలు ముంచి వారి ప్రాణాలు తీశాడు. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలోనూ సంచలనం రేపింది.

Also Read:  Trump-Biden: బైడెన్ చేసిన క్షమాభిక్షలు చెల్లవు అంటున్న ట్రంప్!

Also Read: IPL 2025: రోహిత్ శర్మ కెప్టెన్సీపై పంజాబ్ కింగ్స్ బ్యాటర్ షాకింగ్ కామెంట్స్.. తన కోరిక అదేనంటూ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు