/rtv/media/media_files/2025/01/30/vpVIRPchaK72BR58ojgR.jpg)
Thieves In Satyasai District...
AP Crime: చిత్తూరులో సంచలనం రేపిన దొంగలు ముఠా కేసును పోలీసులు ఛేదించారు. ఏడు మందిని అరెస్టు చేసినట్లు చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. నిందితుల వద్ద ఒక కారు, 3 తుపాకులు, 4 బుల్లెట్లు, 2 కత్తులు, కారంపొడి గమేక్షన్ పొడి, 4 పెల్లెట్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
దొంగతనానికి స్కెచ్ వేసి..
ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడిన ఎస్సీ.. దొంగతనానికి స్కెచ్ వేసింది చిత్తూరుకు చెందిన సుబ్రహ్మణ్యంగా గుర్తించినట్లు తెలిపారు. ఉదయం ఐదున్నర గంటలకు ఓమిని వ్యాన్ లో పుష్ప కిడ్స్ వద్దకు చేరుకున్నారు. మారణాయుధాలతో షాపు మెయిన్ ఎంట్రన్స్ నుంచి కిడ్స్ షాపులోకి ప్రవేశించారు. షాప్ యజమాని చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను డబ్బు ఇవ్వమని బెదిరించారు. కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చంద్రశేఖర్ భార్య శాంతి కేకలు వేయడంతో రియాక్ట్ అయిన చుట్టుపక్కల ప్రజలు ఘటన స్థలానికి చేరుకుని నలుగురు దొంగలను పట్టుకున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: నోటి పూతలను తేలికగా తీసుకోకూడదా?
హత్య కేసుల్లో 10 ఏళ్ల శిక్ష..
మరో ముగ్గురు నిందితులను కాణిపాకం క్రాస్ వద్ద అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితులు చిత్తూరుకు చెందిన సుబ్రహ్మణ్యం, ప్రొద్దుటూరి పట్టణానికి చెందిన ఎస్ ఇబ్రహీం, నంద్యాల జిల్లాకు చెందిన నవీన్ కుమార్, జారుట్ల గ్రామం అనంతపురం జిల్లాకు చెందిన రామాంజనేయులు, రాజశేఖర్, నెట్టి కంటయ్య, సంపత్ కుమార్ గా గుర్తించారు. వారందరినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ప్రధాన నిందితుడు సుబ్రహ్మణ్యంపై కర్నూలు నంద్యాల జిల్లాల్లో ఆరు కేసులున్నట్లు తెలిపారు. దొంగతనం రాబరీ హత్య కేసుల్లో 10 సంవత్సరాల శిక్ష అనుభవించాడని చెప్పారు. 15 సంవత్సరాల క్రితం చిత్తూరులో ఎస్ఎల్వీ ఫర్నిచర్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యం.. వ్యాపారంలో నష్టాలు రావడంతో రాబరికి స్కెచ్ వేసినట్లు నిర్ధారించారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులను ఎస్పీ మణికంఠ చందోలు ప్రశంసించారు.
ఇది కూడా చదవండి: మీలో కాల్షియం లోపం ఉంటే ఈ సమస్యలు తప్పవు