/rtv/media/media_files/2025/02/19/Xt35Ph2wHV5cMvHps2Ez.jpg)
Bangalore married woman sexually assault case Four members arrest
Rape case: బెంగళూర్‌లో దారుణం జరిగింది. నగరం నడి బొడ్డున నలుగురు పిల్లల తల్లిపై సమూహిక అత్యాచారం కలకలం రేపింది. పొట్టకూటికోసం ఇళ్లు వదిలి వచ్చి కుంటుంబాన్ని పోషించుకుంటున్న వివాహితను దుర్మార్గులు నమ్మించి మోసం చేశారు. పని ఇప్పిస్తామని పిలిచి క్రూరమృగాళ్లలాగా ఆమెపై కాంమవాంఛ తీర్చుకున్నారు. తనకు భర్త, పిల్లులున్నారని, ఇలా చేయొద్దని ఆమె వేడుకున్న కనికరించకుండా లైంగిక దాడి చేశారు.
హిందీలో మాట కలిపి..
ఈ మేరకు డీసీపీ సారా ఫాతిమా తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన ఆ వివాహిత తన భర్తతో కలిసి బెంగళూరుకు వచ్చి క్యాటరింగ్ పనులు చేసుకుంటోంది. అయితే గురువారం రాత్రి విధులు ముగించుకుని జ్యోతినివాస్ కళాశాల వద్ద ఫ్రెండ్ ను కలిసేందుకు వెళ్లింది. అక్కడే ఆమెకోసం రోడ్డుపై వేచి చూస్తున్న క్రమంలో సమీపంలోని హోటల్‌లో పని చేస్తున్న నలుగురు యువకులు ఆమె దగ్గరకు వచ్చి హిందీలో మాట కలిపారు. తాము హోటల్‌లోనే పని చేస్తున్నామంటూ కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత ఆమెను భోజనానికి ఆహ్వానించారు. హోటల్ టెర్రస్‌పైకి తీసుకెళ్లి భోజనం పెట్టించి క్యాటరింగ్ ఆర్డర్స్ ఉంటే చెబుతామని నమ్మించారు.
ఇది కూడా చదవండి: TS: మోకాళ్ల లోతు మట్టి, బురద..కష్టతరం అవుతున్న కార్మికుల రెస్క్యూ
ప్రైవేట్ పార్ట్స్ కొరికి..
ఆ తర్వాత ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని చెప్పి తమ రూమ్ కు తీసుకువెళ్లి లైంగిక దాడి చేశారు. నలుగురు బిడ్డల తల్లినని చెబుతున్నా వినలేదు. బాధితురాలి ముఖంతోపాటు ప్రైవేట్ పార్ట్స్ కొరికారు. గోళ్లతో రక్కి హింసించారని పోలీసులు తెలిపారు. ఇక నలుగురు నిందితులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన అజిత్, విశ్వ, శిభుల్, ఉత్తరాఖండ్‌కు చెందిన శోభన్ గా గుర్తించి అరెస్టు చేసినట్లు సారా ఫాతిమా తెలిపారు.
ఇది కూడా చదవండి: Champions Trophy: ఈరోజు మ్యాచ్ లో కోహ్లీ, పంత్ ఆడతారా?