AP Crime: కోరిక తీర్చకపోతే భర్తను చంపేస్తాం.. ఏపీలో వివాహితపై గ్యాంగ్ రేప్.. నగ్నంగా వీడియోలు తీసి!

ఏపీ ఏలూరులో వివాహితపై గ్యాంగ్ రేప్ కలకలం రేపుతోంది. ఉండికి చెందిన మహిళను లైంగిక కోరిక తీర్చాలని లేదంటే భర్తను చంపేస్తామంటూ రవి, సోము మరికొంతమంది రేప్ చేశారు. నగ్న వీడియోలు తీసి డబ్బుకోసం బ్లాక్ మెయిల్ చేయగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

New Update
ao gang rape

ao gang rape Photograph: (ao gang rape)

AP Crime: ఏపీలో మరో లైంగిక దాడి కేసు కలకలం రేపుతోంది. ఏలూరు జిల్లా ఉండి మండలంలో ఓ వివాహితపై కామాంధులు బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డారు. తన కోరికను తీర్చకుంటే భర్తను చంపేస్తామంటూ బెదిరించి ఆమెను పలు ప్రాంతాలకు తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు రాక్షస క్రీడకు పాల్పడ్డారు. ఇంతటితో ఆగకుండా నగ్నంగా వీడియోలు తీసి డబ్బులు కావాలంటూ బ్లాక్ మెయిల్ చేశారు. ఆ దుర్మార్గుల టార్చర్ తట్టుకోలేక  పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు తన బాధను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో పై అధికారులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

భర్తను, కుటుంబాన్ని చంపేస్తాం..

ఈ మేరకు బాధితురాలు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలానికి చెందిన వివాహితపై అదే ప్రాంతానికి చెందిన యర్రం శెట్టి రవి, సోమేశ్వరరావు అలియాస్ సోము అనుచితంగా వ్యవహరించారు. ఆమెను బలవంతంగా లోబర్చుకోవాలని చూశారు. మాట వినకపోతే భర్తను, కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు. ఈ క్రమంలో అత్యాచారానికి పాల్పడ్డారు. పేరుపాలెం సముద్రతీరానికి, భీమవరంలోని స్నేహితుల రూములకు తీసుకెళ్లి అనుభవించారు. ఆ సమయంలో ఆమెకు మత్తు మందు ఇచ్చి నగ్నంగా వీడియోలు తీసిన దుర్మార్గులు బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డారు.

ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!

ఇప్పటికే రూ.2.50 లక్షలు..

బాధితురాలిని బెదిరించి విడతల వారీగా ఇప్పటికే రూ.2.50 లక్షలు తీసుకున్నారు. మళ్లీ డబ్బు కావాలని వేధింపులు మొదలుపెట్టారు. బాధితురాలు వారి వేధింపులు భరించలేక కుటుంబ సభ్యుల సహకారంతో ఈ నెల 1న ఉండి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని, రక్షణ కల్పించాలని కోరింది. కానీ పోలీసులు పట్టించుకోలేదు. రాజీకి రావాలని.. లేదంటే కౌంటర్ కేసు పెడతామని పోలీసులు బెదిరించినట్లు బాధితురాలి కుటుంబం తెలిపింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో బాధితురాలు, వారి కటుంబ సభ్యులు రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరుతూ ఏలూరు రేంజ్ కార్యాలయాన్ని ఆశ్రయించి ఐజీ అశోక్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 

ఇది కూడా చూడండి: Tulsi Gabbard: భారత్ లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది

 

Advertisment
Advertisment
Advertisment