AP Love case: ప్రియుడి కోసం పోటీ.. విషం తాగిన ఇద్దరు యువతులు.. చివరికి ఏమైందంటే!

ఏపీలో మరో లవ్ కేసు సంచలనం రేపుతోంది. అనంతపురంలో దివాకర్ అనే యువకుడి కోసం రేష్మ, శారద అమ్మాయిలు దారుణానికి పాల్పడ్డారు. దివాకర్ తమకు దక్కడేమోననే భయంతో పాయిజన్ తాగారు. శారద చనిపోగా రేష్మ పరిస్థితి విషయమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు. 

New Update
love case

Anantapur love case Two girls drank poison for boyfriend

AP Love case: ఏపీలో మరో లవ్ కేసు సంచలనం రేపుతోంది. ఒక యువకుడి కోసం పోటీపడిన ఇద్దరు యువతులు దారుణానికి పాల్పడ్డారు. మనసు ఇచ్చినవాడు తమకు దక్కుతాడో లేదో, తమ ప్రేమను అంగీకరిస్తాడో లేదోననే భయంతో ఇద్దరు కలిసి ఆత్మహత్యయత్నం చేశారు. విషం తాగి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారిని బంధువులు ఆస్పత్రికి తరలించగా ఒకరు చనిపోయారు. మరో యువతి పరిస్థితి విషమంగా ఉండగా  రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. 

ఎవరిని ప్రేమిస్తున్నాడో  తెలియదు..

ఈ మేరకు బాధితుల బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో ఈ ఘటన జరిగింది. దివాకర్ అనే యువకుడిని రేష్మ, శారద అనే ఇద్దరు అమ్మాయిలు ఇష్టపడ్డారు. అయితే దివాకర్ ఎవరిని ప్రేమిస్తున్నాడో వారికి తెలియదు. ఎప్పుడు చెప్పలేదు. దీంతో కొంతకాలంగా భ్రమలో బతుకున్న యువతులు.. ఇటీవల ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. కానీ ఇద్దరి దగ్గర సమాధానం లేదు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన వారిద్దరూ దివాకర్ తమకు దక్కడేమోనని బాధపడ్డారు. అతడు లేని జీవితం తమకు వద్దనుకున్నారు. ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకుని స్థానిక ఆర్టీవో ఆఫీస్ ముందు జుట్టుకు రంగు వేసే కెమికల్ (సూపర్ వాస్కోల్) తాగారు.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: జగన్ జర్మనీ వెళ్లాలి.. పవన్ సెటైర్లు!

మృతురాలి పేరెంట్స్ ఫిర్యాదు..

ఈ విషయం వారే దివాకర్ కు ఫోన్ చేసి చెప్పగానే ఉలిక్కిపడ్డాడు. వెంటనే ఆర్టీవో ఆఫీస్ వద్దకు చేరుకుని రేష్మ, శారదలను ఆస్పత్రికి తరలించాడు. దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ శారద చనిపోగా రేష్మ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే తమ బిడ్డను అన్యాయంగా చంపేశాడంటూ శారద తల్లిదండ్రులు దివాకర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 

ఇది కూడా చదవండి: TG Crime: తెలంగాణలో దారుణం.. పెళ్లి వొద్దన్నందుకు పిల్ల తండ్రిని కత్తెరతో పొడిచిన మైనర్‌ బాలుడు!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ameenpur 3 Children Case: ‘నేను చచ్చిపోయినా బాగుండేది’.. అమీన్‌పూర్ ముగ్గురు పిల్లల తండ్రి ఆవేదన!

ప్రియుడి కోసం ముగ్గురుపిల్లల్ని హతమార్చిన రజితభర్త ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు. ‘నాతో ఉండటం ఇష్టం లేకపోతే ఇష్టమున్న వాడితో వెళ్ళిపోవాల్సింది. పిల్లలు పదేపదే గుర్తొస్తున్నారు. నేను చనిపోయినా బాగుండేది. బతికుండి క్షణక్షణం చస్తున్నాను’ అంటూ ఆవేదన వ్యక్తంచేశాడు.

New Update
Ameenpur Rajitha Husband Emotional

Ameenpur Rajitha Husband Emotional

ప్రియుడితో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ఓ మహిళ తన కన్న బిడ్డలకు విషం ఇచ్చి హతమార్చిన ఘటన ఇటీవల అమీన్‌పూర్‌లో కలకలం రేపింది. ఈ ఘటనపై ఆ ముగ్గురు పిల్లల తండ్రి గుండెలు పగిలేలా ఆవేదన చెందుతున్నాడు. తనను నమ్మించి.. తన భార్య గొంతు కోసిందని.. తన ప్రాణానికి ప్రాణమైన పిల్లల్ని అతి కిరాతకంగా హత్య చేసిందని అంటున్నాడు. తాజాగా తన బాధను మీడియాతో పంచుకున్నాడు. ఏడుద్దామంటే కంట్లో నుంచి నీళ్లు రావడం లేదని చెప్పాడు. 

Also Read: మనుషులులేని దీవులపై కూడా ట్రంప్ టారిఫ్ ఛార్జీల మోత.. ఎందుకంటే?

నేను చచ్చిపోయినా బాగుండేది

తనతో ఉండటం ఇష్టం లేకపోతే.. తనకు చెప్పకుండా ఇష్టం ఉన్న వాడితో వెళ్ళిపోవాల్సిందని బాధను బయటపెట్టాడు. పిల్లలకి విషమిచ్చి ఊపిరి ఆడకుండా చంపేసి.. తాను యాక్టింగ్ చేసిందని.. ఆ విధంగా తప్పించుకోవాలని చూసిందని అన్నాడు. తన ఆస్తి కోసమే ఆమె ఇదంతా చేసిందని అన్నాడు. అందువల్లనే ఇంత క్రూరత్వానికి పాల్పడిన తన భార్యను, దీనికి కారణమైన శివను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశాడు. తాను చనిపోయినా బాగుండేదని.. బతికుండి క్షణక్షణం చస్తున్నానని గుండె పగిలే మాటలు మాట్లాడాడు. క్షణక్షణం తనకు తన పిల్లలే గుర్తొస్తున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. 

Also Read: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!

సీన్ టు సీన్ జరిగిందిదే

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ఓ తల్లి తన కన్న బిడ్డలను చంపిన ఘటన అమీన్పూర్ లో చోటుచేసుకున్న ఘటనలో సంచలన విషయాలు బయటకువచ్చాయి. బుధవారం సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో కేసు వివరాలను ఎస్సీ పరితోష్ పంకజ్ మీడియాకు వెల్లడించారు. మీన్​పూర్ మున్సిపాలిటీ రాఘవేంద్ర కాలనీలో అవురిజింతల చెన్నయ్య.. భార్య రజిత అలియాస్​లావణ్య కాపురం ఉంటున్నారు. చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా పనిచేస్తుండగా.. రజిత ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తుంది. వీరికి సాయికృష్ణ (12), మధుప్రియ (10), గౌతమ్​(8) ముగ్గురు పిల్లలున్నారు. చెన్నయ్య మొదటి భార్య చనిపోవడంతో లావణ్యను రెండో పెండ్లి చేసుకున్నాడు. రజితకు, చెన్నయ్యకు 20ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. 

Also Read: నటిపై గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక!

గెట్ టు గెదర్ పార్టీలో శివతో పరిచయం 

అయితే ఆరు నెలల క్రితం జరిగిన పదవ తరగతి గెట్ టు గెదర్ పార్టీలో రజితకు తన క్లాస్మేట్ అయిన శివతో పరిచయం మరింతగా పెరిగింది. నెంబర్స్ మార్చుకుని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఇది వివాహేతర సంబంధానికి దారి తీసింది. చాలా సార్లు శారీరకంగా కూడా కలిశారు. భర్తతో ఏజ్ గ్యాప్ ఉండటం,ప్రియుడి మోజులో బాగా మునిగి తేలిన రజితకు భర్త, పిల్లలపై ప్రేమ పూర్తిగా తగ్గిపోయింది. శివకు ఇంకా పెళ్లి కాకపోవడంతో, ఎలాగైనా అతన్ని పెళ్లి చేసుకొని జీవితాంతం సుఖంగా ఉండాలని రజిత భావించింది. ఇందుకోసం తననుపెళ్లి చేసుకోవాలంటూ శివ ముందు ప్రపొజల్ పెట్టింది. ఒకవేళ నీకుపెళ్లి కాకపోయి, పిల్లలు లేకుండా ఉంటే.. కచ్చి తంగా తానుపెళ్లి చేసుకుంటానని శివ చెప్పాడు. దీంతో భర్త, పిల్లల అడ్డు తొలిగించుకుని ప్రియుడితో సుఖంగా ఉండాలని రజిత స్కె్చ్ వేసింది. 2025 మార్చి 27న సాయంత్రం 6 గంటలకు పిల్లలను చంపేస్తానని శివకు చెప్పింది రజిత. ఆ పని త్వరగా పూర్తి చేయాలన్నాడు శివ. 

Also Read: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా

ప్లాన్ లో భాగంగా పెరుగులో విషం

ప్లాన్ లో భాగంగా రజిత పెరుగులో విషం కలిపింది. పిల్లలకు పెరుగుతో అన్నం పెట్టింది.  భర్త చెన్నయ్య మాత్రం పప్పుతో మాత్రమే అన్న తిని ఫోన్ రావడంతో పనికోసం బయటకు వెళ్లాడు. రాత్రి 11 గంటలకు వచ్చి చూసేసరికి పిల్లలు ముగ్గురు విగత జీవులుగా పడి ఉన్నారు. రజిత మాత్రం కడుపు నొప్పిగాఉందంటూ నాటకం ఆడింది. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చారు చెన్నయ్య .ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.ముందుగా మహిళ భర్త చెన్నయ్యను అనుమానించిన పోలీసులు చివరికి తల్లే హంతకురాలిని తేల్చారు. రజిత ఆమె ప్రియుడు శివను  కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

(latest-telugu-news | ameenpur 3 children case update | ameenpur 3 children case | ameenpur 3 children incident | today-news-in-telugu | breaking news in telugu | telangana crime case | telangana crime incident | telangana crime news | telangana-crime-updates)
Advertisment
Advertisment
Advertisment