/rtv/media/media_files/2025/02/23/nMrJIfIgyhxE3iTYtuIS.jpg)
Prabhas The Raja Saab Updates
Prabhas The RajaSaab Updates: కేరళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్(Malavika Mohanan) కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌తో "వేట" చిత్రంతో సినిమా రంగంలో అడుగు పెట్టింది, తర్వాత తన రెండో సినిమాగా "దళపతి" విజయ్‌తో నటించే అద్భుతమైన అవకాశం కొట్టేసింది. "మాస్టర్"మూవీతో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చారు పాత్రలో నటించి, ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.
Also Read: మైనర్ బాలికలు శృంగారం చేస్తే తప్పుకాదు.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!
ఆపై బాలీవుడ్‌లో అడుగు పెట్టిన మాళవిక, "యుద్ధ" వంటి అనేక సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా, పా రంజిత్ దర్శకత్వంలో "తంగలాన్" చిత్రంతో కోలీవుడ్‌లో తిరిగి సరికొత్త ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఆదివాసీ మహిళ ఆరతి పాత్రలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఆమె నటనపై ప్రశంసలు వచ్చాయి.
Also Read: సీఎం రేవంత్‌కు రాహుల్ గాంధీ ఫోన్.. SLBC ఘటనపై ఏం చెప్పారంటే!
ప్రభాస్‌తో "రాజా సాబ్" సినిమాలో..
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫుల్ బిజీగా ఉంది. కోలీవుడ్‌లో కార్తీ "సర్దార్" సినిమాలో నటిస్తున్న మాళవిక, "మిత్రన్" అనే మూవీలో కీలక పాత్రలో కనిపించనుంది. మాళవిక మోహన్ మాల్‌వుడ్‌లో మోహన్ లాల్‌తో మరో సినిమా చేస్తోంది. అంతేకాక, తెలుగులో మన డార్లింగ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో "రాజా సాబ్" సినిమాలో నటిస్తుంది. కామెడీ, హారర్ జోనర్‌లో మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీపై భారీ హైప్ ఉంది. అన్గాన్ని కుదిరితే ఈ చిత్రం 2025లో దసరాకి విడుదల కానుంది.
Also Read: MLC ఎన్నికలకు దూరం.. మంత్రి శ్రీధర్ బాబు సంచలన ప్రకటన!
మాళవిక ఈ చిత్రాన్ని చేయడానికి ప్రధాన కారణం తాజాగా వెల్లడించింది. "రాజా సాబ్" చిత్రం హారర్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోందని పేర్కొన్న మాళవిక, ఈ సినిమాలో తన పాత్ర చాలా ముఖ్యమైందని చెప్పింది. సాధారణంగా స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్‌కు స్క్రీన్ టైమ్ తక్కువ ఉంటుందని ఆమె అభిప్రాయపడింది.
Also Read: సీఎం రేవంత్‌కు రాహుల్ గాంధీ ఫోన్.. SLBC ఘటనపై ఏం చెప్పారంటే!
కానీ రాజా సాబ్ లో మాత్రం తన రోల్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉంటుందని అందుకే ఆ పాత్ర చేస్తున్నట్లు పేర్కొంది మాళవిక. ఈసారి ప్రభాస్ తో కలిసి సూపర్ హిట్ ను అందుకునేందుకు సిద్ధంగా ఉందట ఈ ముద్దుగుమ్మ. మరి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ది రాజాసాబ్ . ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో.. వెయిట్ చేసి చూడాలి.