/rtv/media/media_files/2025/04/07/lAEW8AaBYJeHrLYHo6yq.jpg)
ntr-sukumar
యంగ్ టైగర్ ఎన్టీఆర్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలోవచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. దీంతో వీరిద్దరి కాంబోలో మరో మూవీ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అలాంటి ఫ్యాన్స్ కు వీరిద్దరూ గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా వీరిద్దరూ కలిసి హగ్ చేసుకున్న ఫోటోను సుకుమార్ భార్య తబిత ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. తారక్ కి ప్రేమతో అని ఆమె క్యాప్షన్ ఇచ్చింది.
Also read : రిటైర్మెంట్ వార్తలపై ధోనీ బిగ్ అనౌన్స్మెంట్!
Also Read : SRH VS GT : సన్‌రైజర్స్ కు బిగ్ షాక్ .. మహమ్మద్ సిరాజ్ అరుదైన రికార్డు
Ju ntr started his usual dinner settings just as he did before and this time with director #Sukumar for his next as soon as he saw #PeddiFirstShot #NatukoliSaru
— SURYA🚁 (@Surya58204565) April 6, 2025
Which curry this time @tarak9999 🤔 pic.twitter.com/ayTY9Yp5bD
నన్ను వెంటాడే ఎమోషన్ సుకుమార్
ఆమె పోస్టును రిపోస్ట్ చేసిన ఎన్టీఆర్ నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్ సుకుమార్" అనే క్యాప్షన్ ఇచ్చారు. ఇద్దరి మధ్య కథ చర్చలు నడిచాయని సినిమా చేసేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ .. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్‌లో నటిస్తున్నాడు. ఇది అయిపోయాక దేవర2 చేయబోతున్నాడు. అనంతరం సుకుమార్ తో సినిమా చేయనున్నాడు.
పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా ఉంటుందని సమాచారం. కాగా పుష్ప 2: ది రూల్ లాంటి హిట్ తరువాత సుకుమార్ తన కొత్త సినిమాను ఇంకా అనౌన్స్ చేయలేదు. విజయ్ దేవరకొండతో సినిమా ఉంటుందని సమాచారం.
Also Read : కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రికి నటి హేమ బిగ్ షాక్!
Also Read : అగ్నివీరులకు గుడ్‌న్యూస్.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు
jr-ntr | Tollywood news updates | tollywood-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu