/rtv/media/media_files/2025/01/21/vo1UQKd1tsH0IXYByXxq.jpg)
amithab bachan Photograph: (amithab bachan)
Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్‌కు రియల్ఎస్టేట్‌లో కాసుల పంట పడింది. ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌ను అమ్మితే 168 శాతం లాభం వచ్చింది. అంధేరీ ప్రాంతంలో అట్లాంటిస్ బిల్డింగ్‌లో ఉన్న 5వేల చదరపు అడుగుల డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్ అమితాబ్ బచ్చన్ రూ.83 కోట్లకు అమ్మాడు. జనవరి 17న దీనికి సంభందించి అధికారికంగా రిజిస్ట్రేషన్ అయ్యింది. ముంబైలోని అంధేరీలోని అట్లాంటిస్ భవనంలోని 27, 28 అంతస్తుల్లో ఆ డూప్లెక్స్ ఫ్లాట్ ఉంది. అపార్ట్‌మెంట్ సేల్‌లో స్టాంప్ డ్యూటీనే రూ.4.98 కోట్లు, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30,000 చెల్లించాడు బిగ్ బీ.
Also Read: Kiran Abbavaram: తండ్రి కాబోతున్న మరో టాలీవుడ్ హీరో.. సోషల్ మీడియాలో పోస్ట్ !
ఈ అపార్ట్‌మెంట్‌ను విజయ్ సింగ్ ఠాకూర్, కమల్ విజయ్ ఠాకూర్‌లు కొన్నారు. అమితాబ్ బచ్చన్ దీన్ని 2021 ఏప్రిల్‌లో రూ.31 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇది ఇప్పుడు రూ. 83 కోట్లకు విక్రయించబడింది. దీని విలువ దాదాపు 168 శాతం పెరిగింది. 2021 నవంబర్ నుంచి అమితాబ్ బచ్చన్ ఈ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను నటి కృతి సనన్‌కు నెలకు రూ.10 లక్షలకు రెంట్‌కు ఇచ్చారు. 2025 జనవరి 17 అపార్ట్‌మెంట్ అమ్మేశారు. 2020 నుంచి 2024 వరకు బచ్చన్ ఫామిలీకి రియల్ ఎస్టేట్‌లో బాగా లాభాలు వచ్చాయి. దాదాపు రూ.200 కోట్ల వరకు భారీగా పెట్టుబడులు పెట్టారు. వీటిలో చాలా వరకు ముంబై సిటీతోపాటు చుట్టు పక్కల ఉన్నాయి.
Also Read: Dil Raju: ఐటీ సోదాల్లో బిగ్ ట్విస్ట్.. దిల్ రాజు సతీమణితో బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయించిన అధికారులు!