అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) కాంబోలో రిలీజ్ కానున్న చిత్రం తండేల్ (Thandel). డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. బన్నీ వాసు ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అయితే మూవీ టీం సినిమా ట్రైలర్‌ను తాజాగా వైజాగ్‌లో గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్ చేసింది.
ఇది కూడా చూడండి: Maha Kumbh Mela : మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అమృత స్నానాలపై అఖండ పరిషత్ కీలక నిర్ణయం
వైజాగ్ లో సినిమా ఆడితే ప్రపంచం మొత్తం కలెక్షన్స్ అద్భుతంగా వస్తాయి.
— Thandel Raju🌊⚓ (@chaithurajkumar) January 28, 2025
నేను వైజాగ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను.
- Naga Chaitanya pic.twitter.com/UVm9BNLrW7
ఇది కూడా చూడండి: Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి విదేశయాన ప్రయత్నాలు సులభం అవుతాయి..!
వైజాగ్ అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నానని..
ఈ ఈవెంట్‌కి అల్లు అరవింద్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో నాగచైతన్య మాట్లాడుతూ..ఏ సినిమా అయినా రిలీజ్ అయితే వైజాగ్ టాక్ ఏంటని తెలుసుకుంటానన్నారు. వైజాగ్‌లో సినిమా ఆడితే ప్రపంచంలో ఎక్కడైనా ఆడాల్సిందే. తనకి వైజాగ్ ఎంతో క్లోజ్ అని, వైజాగ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానన్నారు. ఇంట్లో రూలింగ్ వైజాగ్ వాళ్లదే.. ఇక్కడ కలెక్షన్లు రాకపోతే ఇంట్లో తన పరువు పోతుందన్నాడు. శ్రీకాకుళం స్లాంగ్‌లో మాట్లాడుతూ.. ఈసారి యాట తప్పేదిలేదని నాగ చైతన్య అన్నారు.
ఇది కూడా చూడండి: Big Breaking: కుంభమేళాలో తొక్కిసలాట ..17 మంది మృతి!
నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న తండేల్ ట్రైలర్‌ను ఇటీవల విడదుల చేశారు. ఈ జోడీ మళ్లీ రిపీట్ కావడంతో సినిమా ఈసారి పక్కా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గతంలో లవ్ స్టోరీ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టారు. మత్స్య కారుల కథనంతో.. శ్రీకాకుళంలో జరిగిన యదార్థ సంఘటనలు ఆధారంగా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఇది కూడా చూడండి: Cinema: జానీ మాస్టర్ పై కేసు గెలిచాం..ఫిల్మ్ ఛాంబర్