/rtv/media/media_files/2025/02/15/O7T7tRit4VaLmcOgg66X.jpg)
whatsapp new fueture Photograph: (whatsapp new fueture)
ఇన్‌స్టాంట్ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) త్వరలో సరికొత్త ఫీచర్ తీసుకురానుంది. వాట్సాప్ యూజర్లు తమ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ (Instagram Profile) లను యాప్‌కి లింక్ చేసుకోవచ్చు. నివేదికల ప్రకారం, మెటా యాజమాన్యంలోని కంపెనీ ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఫీచర్ తాజా iOS బీటా వెర్షన్ వారికి అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. ఆడ్రాయిండ్ వర్షన్ మొబైల్ యూజర్లు ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇది ఇంకా అభివృద్ధిలో ఉంది. వాట్సాప్ ద్వారా తమ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లను లింక్ చేయాలనుకునే ఇన్‌స్టాగ్రామ్ వీడియో కంటెంట్ క్రియేటర్స్, నార్మల్ యూజర్లకు ఈ ఫీచర్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు సోషల్ మీడియా అకౌంట్ ఏవైనా వాట్సాప్ అకౌంట్లో యాడ్ చేసుకోవచ్చు.
Also Read : మస్క్యులోస్కెలెటల్ డిజార్డర్స్‌కు యోగాతో చెక్.. మోరార్జీ దేశాయ్ యోగా కేంద్రంలో వర్క్‌షాప్
WhatsApp Link With Instagram Profile
📝 WhatsApp beta for Android 2.25.4.9: what's new?
— WABetaInfo (@WABetaInfo) February 13, 2025
WhatsApp is working on a feature to add social media links to user profiles, and it will be available in a future update!https://t.co/idL3WtVZrn pic.twitter.com/aPHUtjAfkj
Also Read : మస్తాన్ సాయికి బిగ్ షాక్.. కోర్టు సంచలన తీర్పు: ఇక జైల్లోనే!
వాట్సాప్ నెంబర్ అకౌంట్ చూసినప్పుడు మీ ఇన్‌స్టాగ్రామ్ అంకౌట్ కూడా చూపిస్తోంది. అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఈ ఫీచర్ వినియోగదారులు వాట్సాప్ ప్రొఫైల్ విభాగంలో వారి ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లింక్‌ను నమోదు చేయడానికి అనుమతిస్తుంది. ఇది మాత్రమే కాదు, వినియోగదారులు వారి ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పేరును కూడా దీనికి లింక్ చేసుకోవచ్చు.
Also Read: మోనాలిసా రేంజ్ మారింది.. మాల్ ఓపెనింగ్ లో డాన్సులతో సందడి.. వీడియో చూశారా!
ఈ ఫీచర్ పట్ల కొందమంది యూజర్లు ఆనందం వ్యక్తం చేస్తుంటే.. వారి ప్రైవసీకి భంగం కలుగుతుందన మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోప్యత, ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఇతరులు తెలుసుకుంటారని భయపడుతున్నారు. అందుకే ఇది అడిషన్ ఫీచర్‌గా ఉంటుందని WABetaInfo పేర్కొంది. యూజర్లు కావాలనుకుంటేనే వాట్సాప్ కు ఇన్‌స్టాగ్రామ్ లింగ్ చేసుకోవచ్చని ప్రకటించింది.
Also Read: మోదీ మాటలకే పరిమితం.. AI విషయంలో ఫెయిల్: రాహుల్ గాంధీ