Gold Rates: పసిడి ప్రేమికులకు బిగ్ షాక్.. పెరిగిన ధరలు

నేడు మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,990 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,100గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.

New Update
Gold1

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రారంభంలోనే బంగారం ధరలు పెరుగుతున్నాయి. నేడు బంగారం రూ.421 పెరిగి.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,990గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,100గా ఉంది. ఇంకా ఈ ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.

ఇది కూడా చూడండి: AP JOBS: ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు.. అర్హత, చివరి తేదీ వివరాలివే!

ఇదిలా ఉండగా ఈ ఏడాది బంగారం ధరలు ఆకాశాన్ని తాకనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. పది గ్రాముల బంగారం ధర దాదాపుగా రూ.90 వేలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ యుద్ధాలు, గ్లోబల్ మార్కెట్‌లో అనిశ్చితల వల్ల బంగారానికి భారీగా డిమాండ్ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. సెంట్రల్ బ్యాంకులు కూడా ఎక్కువగా బంగారం కొనే ఛాన్స్‌లు ఉన్నాయట. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమస్యలు క్లియర్ అయితే మాత్రం బంగారం ధరలు తగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. గతేడాది బంగారం ధరలు దాదాపు 23 శాతం పెరగ్గా, వెండి ధరలు 30 శాతం పెరిగాయి. 

ఇది కూడా చూడండి:Air India: ప్రయాణికులకు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన ఎయిర్‌ ఇండియా..

24 క్యారెట్ల బంగారం ధర

చెన్నైలో 10 గ్రాముల ధర రూ.77,560
ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.77,710
హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.77,560
ముంబైలో 10 గ్రాముల ధర రూ.77,560
కోల్‌కతాలో 10 గ్రాముల ధర రూ.77,560

ఇది కూడా చూడండి: RJ:బోర్‌‌వెల్‌లో పది రోజులు ఉన్న పాప..రెస్క్యూ చేసిన తర్వాత మృతి

22 క్యారెట్ల బంగారం ధర

చెన్నైలో 10 గ్రాముల ధర రూ.71,100
ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.71,250
హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.71,100
ముంబైలో 10 గ్రాముల ధర రూ.71,100
కోల్‌కతాలో 10 గ్రాముల ధర రూ.71,110

ఇది కూడా చూడండి:TS: గర్ల్స్ హాస్టల్ బాత్‌రూమ్‌లో వీడియోలు.. విద్యార్థినుల ఆందోళన

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

UPI Transactions: మరోసారి ఆగిపోయిన యూపీఐ సేవలు.. గందరగోళానికి గురవుతున్న వినియోగదారులు

దేశంలో మరోసారి యూపీఐ సేవలు నిలిచిపోయాయి. డిజిటల్ పేమెంట్స్ కావడం లేదని సోషల్ మీడియాలో కస్టమర్లు ట్వీట్స్ చేస్తున్నారు. పేమెంట్స్ కాకపోవడంతో కస్టమర్లతో పాటు వ్యాపారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. యూపీఐ పేమెంట్స్ ఆగిపోవడం ఇది రెండోసారి. 

New Update
upi transactions

upi transactions

UPI Transactions:

యూపీఐ సేవలు మరోసారి ఆగిపోయాయి. గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే సర్వర్లు అన్ని కూడా డౌన్ అయ్యాయి. అసలు పేమెంట్స్ కావడం లేదని సోషల్ మీడియాలో కస్టమర్లు ట్వీట్స్ చేస్తున్నారు. పేమెంట్స్ కాకపోవడంతో హోటల్స్, షాపులు, మాల్స్, టీ షాపులు, టిఫిన్ సెంటర్లు, పండ్ల మార్కెట్లు ఇలా అన్ని చోట్ల కూడా కస్టమర్లు, వ్యాపారులు గందరగోళానికి గురవుతున్నారు. చేతిలో డబ్బులు వాడటం చాలా మంది ఎప్పుడో మరిచిపోయారు. ఇప్పుడు సడెన్‌గా యూపీఐ పనిచేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ వారంలో యూపీఐ పేమెంట్స్ ఆగిపోవడం ఇది రెండోసారి. 

ఇది కూడా చూడండి: TG Crime: సిరిసిల్లలో ఘోరం.. తొగొచ్చి తండ్రిని కొట్టి చంపిన కొడుకు!

ఇది కూడా చూడండి: Brain Health: ఈ అలవాట్లు వెంటనే మానెయ్ లేదంటే బ్రెయిన్ షెడ్డుకే..!

ఇది కూడా చూడండి: Hyderabad Mandi Biryani: హైదరాబాద్‌ వాసులకు 'ఫ్రీ మండి' బిర్యానీ.. ఎలాంటి షరతులూ లేవు..

ఇది కూడా చూడండి: China: మీరు పెంచితే మేము పెంచమా అంటున్న చైనా..125 శాతం సుంకం పెంపు

Advertisment
Advertisment
Advertisment