/rtv/media/media_files/zhTJ1U1UZhj7CFiY8zXk.jpg)
Stock Market
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవి చూస్తున్నాయి. ట్రంప్ టారీఫ్ ల దెబ్బ ప్రపంచం మొత్తాన్ని కుదిపేస్తోంది. నిన్న అమెరికా మార్కెట్లు బ్లడ్ బాత్ ను చూశాయి. దాని ప్రభావం ఈరోజు మన మార్కెట్ల మీద కూడా పడింది. మొదట ఉదయం ప్రారంభంలో స్వల్ప నష్టాలనే చూసిన సూచీలు...తరువాత భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.
దారుణంగా పడిపోయాయి..
ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 800 పాయింట్లు తగ్గి 75,500 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 300 పాయింట్లు కోల్పోయి.. 23,000 కంటే తక్కువకు పడిపోయింది. NSE రంగాల సూచీలలో, నిఫ్టీ ఫార్మా, హెల్త్‌కేర్ మరియు మెటల్ సూచీలు దాదాపు 4% తగ్గాయి. ఆటో, ఐటీ, రియల్టీ సూచీలు 2% కంటే ఎక్కువ క్షీణించాయి. విదేశీ మదుపర్లు స్టాక్స్ ను అమ్మేస్తున్నారు. దీని వలన అంతర్జాతీయంగా, దేశీయంగా కూడా మార్కెట్లో ఒత్తిడిని పెంచుతోంది. ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలు మరియు 2025 మొదటి త్రైమాసికంలో US GDP 2.8% తగ్గుతుందనే అంచనా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తగ్గించాయి. దీనివల్ల స్టాక్ మార్కెట్లో అస్థిరత పెరుగుతోంది.
Also Read: IPL 2025: రెండు చేతులతో బౌలింగ్..ఏం టాలెంట్ రా భయ్
ఆసియా మార్కెట్లలో, జపాన్ నిక్కీ 2.64%, కొరియా కోస్పి ఇండెక్స్ 1.57% తగ్గాయి. క్వింగ్మింగ్ ఫెస్టివల్ కారణంగా చైనా మార్కెట్ కు ఈరోజు సెలవు. ఇక ఏప్రిల్ 3న అమెరికా డౌ జోన్స్ 3.98% తగ్గి 40,545 వద్ద ముగిసింది. ఎస్ అండ్ పి 500 ఇండెక్స్ 4.84% పడిపోయింది. నాస్‌డాక్ కాంపోజిట్ 5.97% పడిపోయింది. ఏప్రిల్ 3న విదేశీ పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) రూ.2,806 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. అదే సమయంలో, దేశీయ పెట్టుబడిదారులు (DIIలు) రూ.221.47 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
today-latest-news-in-telugu | stock-markets | sensex | nifty | shares
Also Read: USA: గోల్డ్ కార్డ్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన అమెరికా అధ్యక్షుడు