కొత్త సంవత్సరం వచ్చేసింది. అందరూ కూడా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అయితే కొత్త సంవత్సరంలో కేవలం ఇయర్ మాత్రమే మారులేదు. దేశంలో కొన్ని రూల్స్ కూడా మారాయి. మరి నేటి నుంచి మారునున్న ఆ రూల్స్ ఏంటో తెలుసుకోండి. ఇది కూడా చూడండి: Buttermilk: మజ్జిగలో కొన్ని కలిపి తాగితే వ్యాధులు మాయం కార్ల ధరలు జనవరి 1 నుంచి కార్ల ధరలు పెరగనున్నాయి. దాదాపుగా అన్ని వాహన తయారీ సంస్థలు కూడా ధరలను పెంచుతున్నాయి. ముఖ్యంగా హోండా ఇండియా, మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా, టాటా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్, ఆడీ, ఎంజీఈ మోటార్ కంపెనీలు పెంచనున్నాయి. దాదాపుగా మూడు శాతం పెంచనున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చూడండి: Year Ender 2024: 2024లో కనిపించని పెద్ద హీరోలు ప్రైమ్ యూజర్లకు బిగ్ షాక్అమెజాన్ ప్రైమ్ వీడియో యూజర్లకు బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ఇది వరకు ఒకేసారి ఐదు డివైజులను కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ జనవరి 1 నుంచి కేవలం రెండు డివైజ్‌లకు మాత్రమే కనెక్ట్ చేసుకోవాలి. రెండు కంటే ఎక్కువ డివైజ్‌లో వాడాల్సి వస్తే కొత్త కనెక్షన్ తీసుకోవాలి. యూపీఐ లిమిట్స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా యూపీఐ పనిచేసేలా UPI123PAY తీసుకొచ్చారు. దీని పరిమితి కూడా వచ్చే ఏడాది నుంచి పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు రూ.5 వేలు ఉన్న లిమిట్‌ను రూ.10 వేలకు పెంచుతున్నారు. ఇది కూడా చూడండి: Kadapa: పోలీస్ స్టేషన్‌లోనే ఎస్‌ఐపై దాడి గ్యాస్ ధరలుఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా రేపటి నుంచి పెరగనున్నాయి. సాధారణంగా ప్రతీ నెల వీటి ధరల్లో మార్పులు వస్తాయి. అయితే గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరల్లో మార్పులు రావు. కేవలం వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రమే మార్పులు చేశారు. ఇది కూడా చూడండి: జనవరి 1 నుంచి ఈ 3 రకాల బ్యాంక్ అకౌంట్లు మూతపడనున్నాయి..వీటిలో మీ అకౌంట్ ఉందా చూసుకోండి మరి!