జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ నుంచి నింగిలోకి ఫస్ట్ టెస్ట్ రాకెట్‌

జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ అంతరిక్ష కంపెనీ గురువారం తన మొదటి టెస్ట్ ఫ్లైట్‌లో న్యూ గ్లెన్ రాకెట్‌ను ప్రారంభించింది. ఫ్లోరిడాలో ఈ రాకెట్‌ను లాంచ్ చేసింది. భూమికి వేల మైళ్ల కక్ష్యలో ఉండేలా ప్రోటోటైప్ ఉపగ్రహాన్ని ఇది మోసుకెళ్లింది.

New Update
blue origin

blue origin Photograph: (blue origin)

స్పేస్‌లోకి మనుషులను తీసుకెళ్తామని ప్రపంచవాప్తంగా ఇద్దరు కుబేరులు పోటీపడుతున్నారు. ఎలన్ మస్క్ స్పెస్ ఎక్స్, జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ అనే రెండు కంపెనీలు స్థాపించి మానవులను ఇతర గ్రహాలకు చేరవేయాలనే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు పని చేస్తున్నాయి. అందులో భాగంగా బ్లూ ఆరిజిన్ గురువారం తన మొదటి టెస్ట్ ఫ్లైట్‌లో న్యూ గ్లెన్ రాకెట్‌ను ప్రారంభించింది. ఫ్లోరిడా నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించారు. భూమికి వేల మైళ్ల కక్ష్యలో ఉండేలా ప్రోటోటైప్ ఉపగ్రహాన్ని ఇది మోసుకెళ్లింది. భూమి కక్ష్యలోకి ప్రవేశపెట్టిన మొదటి అమెరికన్ పేరు మీదుగా దీనికి న్యూ గ్లెన్ రాకెట్ అని పేరు పెట్టారు.

Also Read: Planet Parade: ఫిబ్రవరి 28న ఆకాశంలో అద్భుతం..ఒకే లైన్‌ లోకి 7 గ్రహాలు!

బ్లూ ఆరిజిన్ న్యూ గ్లెన్ లాంచ్ సైట్‌కి USD 1 బిలియన్ కంటే ఎక్కువ ఖర్చు చేసింది. కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్‌లో చారిత్రాత్మక కాంప్లెక్స్ 36ని ఏర్పాటు చేసింది. ఈ శాటిలైట్ టెస్టింగ్ కోసం భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు రెండవ దశలోనే ఉంటుందని భావించారు. ఈ మిషన్ ఆరు గంటల పాటు కొనసాగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. స్పేస్‌ఎక్స్ CEO ఎలోన్ మస్క్ ఈ ఘనత సాధించినందుకు జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్‌ను అభినందించారు. మొదటి ప్రయత్నంలోనే కక్ష్యను చేరుకున్నందుకు అభినందనలని ఎక్స్‌లో పేర్కొన్నాడు.

25 సంవత్సరాల క్రితం బెజోస్ బ్లూ ఆరిజిన్ స్థాపించాడు. 2021 నుంచి ఈ సంస్థ అంతరిక్షలోకి ప్రయాణించాలని ప్రాజెక్టులు ప్రారంభించింది.  ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ 2023లోనే 130కి పైగా ప్రయోగాలను విజయవంతం చేసింది. 

Also Read: Trump: కాల్పుల విరమణ ఒప్పందాన్ని తన ఖాతాలో వేసుకున్న ట్రంప్..కారణమేంటి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు