Anil Ambani: మనీలాండరింగ్‌ కేసు.. ఈడీ ముందుకు అనిల్ అంబానీ

రిలయన్స్‌ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు హాజరయ్యారు.

New Update
Anil Ambani Appears Before Probe Agency ED In Money Laundering Case

Anil Ambani Appears Before Probe Agency ED In Money Laundering Case

రిలయన్స్‌ గ్రూప్(reliance-group) ఛైర్మన్ అనిల్ అంబానీ(anil-ambani) మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు హాజరయ్యారు. అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (ADAG)కు సంబంధించి రూ.40 వేల కోట్ల బ్యాంకింగ్, కార్పొరేట్ మోసం కేసులో ఈడీ అధికారులు ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఫిబ్రవరి 26న విచారణకు రావాలని కొన్నిరోజుల క్రితం ఈడీ అనిల్ అంబానికి సమన్లు జారీ చేసింది.  

Also Read: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌ కౌంటర్‌..ఇద్దరు మావోయిస్టులు మృతి

Anil Ambani Money Laundering Case

గురువారం ఉదయం 10.30 గంటలకు సెంట్రల్‌ ఢిల్లీలోని ఫెడరల్ దర్యాప్తు సంస్థ ఆఫీసుకు అనిల్ అంబానీ వెళ్లారు. మరోవైపు ముంబయిలోని ఆయన నివాసమైన అబోడ్‌ను కూడా ఈడీ అధికారులు అటాచ్ చేశారు. దీని విలువ సుమారు రూ.3716 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. తాజాగా అటాచ్‌ చేసిన వాటితో కలిసి వీటి మొత్తం విలువ రూ.15,700 కోట్లుగా ఉంది.  

Also Read: సోషల్ మీడియా రారాజు మోదీ: ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ల ఫాలోవర్లతో సరికొత్త ప్రపంచ రికార్డు!

అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు వేలాది కోట్లు బ్యాంకు రుణ మోసానికి పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈడీ కేసు నమోదు చేసింది. వీటి విలువ మొత్తం రూ.40 వేల కోట్లుగా ఉంది. గతేడాది కూడా ఆగస్టులో అనిల్ అంబానీ ఈడీ అధికారులు విచారణకు హాజరయ్యారు.  

Advertisment
తాజా కథనాలు