CM Jagan: చంద్రబాబు అరెస్ట్ మీద ఏపీ సీఏం జగన్ కీలక సమావేశం

లండన్ పర్యటన ముగించుకుని ఏపీ సీఎం జగన్ దంపతులు రాష్ట్రానికి వచ్చారు. ఈరోజు చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో తాజా పరిణామాలు, శాంతిభద్రతలపై జగన్ సమీక్ష చేయనున్నారు. దాంతో పాటూ వైసీపీ ముఖ్యనేతలతో కూడా ఆయన భేటీ అవుతారు. రేపు జగన్ ఢిల్లీ వెళ్ళనున్నారు.

New Update
CM Jagan: చంద్రబాబు అరెస్ట్ మీద ఏపీ సీఏం జగన్ కీలక సమావేశం

CM Jagan Meeting with YCP leaders: లండన్ పర్యటన ముగించుకుని ఆంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు ఈరోజు తెల్లవారుఝామున రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ దగ్గర జగన్ కు ఘన స్వాగతం లభించింది. సీఎస్, మంత్రులు, డీజీపీ ఆయనకు స్వాగంత పలికారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆంధ్రాలో పరిస్థితులు చాలా మారాయి. వాటి పరిణామాలు, శాంతి భద్రతల మీద జగన్ ఈరోజు సమీక్ష చేయనున్నారు. దాని తర్వాత వైసీపీ ముఖ్య నేతలతో కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) అయిన దగ్గర నుంచీ జగన్ రాష్ట్రంలో లేరు. అందుకే ఈరోజు జరగనున్న జగన్‌ భేటీపై ఉత్కంఠ నెలకొంది. ఇందులో ముఖ్యమంత్రి ఏం నిర్ణయాలు తీసుకుంటారో అని అందరూ ఎదురు చూస్తున్నారు.

ఇక సీఎం జగన్మోహన్ రేపు ఢిల్లీ వెళ్ళనున్నారు. అక్కడ కేంద్రమంత్రులతో జగన్ భేటీ అవుతారని తెలుస్తోంది.

ప్రధాని మోదీ (Modi), అమిత్‌షాల (Amit Shah) ను కూడా సీఎం కలుస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులపై కేంద్రమంత్రులతోనూ, మోదీ, అమిత్ షాలతోనూ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
పార్లమెంట్ సమావేశాల్లో కీలక బిల్లుల ఆమోదానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్‌ను ఢిల్లీకి రావాలని కేంద్ర ప్రభుత్వం ముందే కోరింది. అయితే విదేశీ పర్యటనలో ఉండడంతో సెప్టెంబర్ 13న వస్తానని జగన్ వారికి ముందే చెప్పారు. ఇప్పుడు
చంద్రబాబు అరెస్టు తర్వాత జగన్ ఢిల్లీ టూర్‌ వెళుతుండడంపై ఆ విషయంలో కూడా ఉత్కంఠత నెలకొంది. మోదీ, అమిత్‌షాతో మీటింగ్‌లో బిల్లులుతో పాటూ, చంద్రబాబు అరెస్టు చర్చకు వచ్చే అవకాశం ఉండడంతో వారు ఏం మాట్లాడుకుంటారో, ఏం నిర్ణయాలు తీసుకుంటారో అని అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు.

Also Read: మార్నింగ్ యోగా, వాకింగ్ చేసిన చంద్రబాబు…నేడు లోకేశ్, బ్రహ్మణి కలిసే ఛాన్స్..!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: అయ్యో బిడ్డలు.. ఈత కోసం వెళ్లి తిరిగి రాని లోకానికి

అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలంలో విషాదం చోటు చేసుకుంది. కుంటలో మట్టి కోసం తవ్విన గుంతలో పడి దేవాన్ష్‌ (6), విజయ్‌ (6), యశ్వంత్‌ (7) లు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారి ముగ్గురు పిల్లలు శవాలై కనిపించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.

New Update
annamaiah crime news

annamaiah crime news

AP Crime: ఏపీలో విషాదం చోటు చేసుకుంది. సరదాకు ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు పాణాలు కోల్పోయారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. అప్పటి వరకు ఆ ఊరంతా రామ నామస్మరణతో మార్మోగింది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా.. గ్రామస్థులంతా ఉత్సవ కార్యక్రమాన్ని చూసేందుకు వెళ్లారు. పండుగ వేళ ఉరంతా సంతోషంగా ఉన్న సమయంలో ఓ విషాదం జరిగింది.  వేడుక అనంతరం ముగ్గురు పిల్లలు కనిపించకుండా పోయారు. విషయం తెలుసుకున్న  కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయారు. కన్న బిడ్డులు మృతి చెందిన విషయం తెలుసుకుని విషాదంలో మునిగిపోయారు. 

ప్రాణం తీసిన ఈత..

ఈ హృదయ విషాదకర సంఘటన శుక్రవారం జరిగింది. చిట్వేలి మండలంలో ఎం. రాచపల్లికి చెందిన చొక్కరాజు నరసింహరాజుకు కుమారుడు దేవాన్ష్‌ (6), శేఖర్‌రాజు కుమారుడు విజయ్‌ (6), వెంకటేష్‌ కుమారుడు యశ్వంత్‌ (7)లు కలిసి గ్రామంలో జరిగిన సీతారాముల ఉభయంలో పాల్గొన్నారు. అనంతరం ఊరి సమీపంలోని నీటి కుంట దగ్గరకు ఈత కొట్టేందుకు వెళ్లారు. నీళ్లలో దిగి ఈత రాక.. ప్రమాదవశాత్తు మునిగి మృత్యువాత పడ్డారు. పిల్లల ఈతకు వెళ్లి మృతి చెందిన విషయం తెలియక కుటుంబ సభ్యులు ఆలయం దగ్గర ఉన్నారు అనుకోని ఇంటికి వెళ్లారు. 

ఇది కూడా చదవండి: యువతకు నోటి క్యాన్సర్ ముప్పు..ఈ లక్షణాలను అశ్రద్ధ చేయొద్దు

సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో ఆలయ మైకులో పేర్లు చెప్పించారు. అయినా ఆచూకీ తెలియకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఊరు బయట ఉన్న నీటి కుంట దగ్గర వెతకగా.. ముగ్గురి మృతదేహం లభ్యమైంది. విజయ్, యశ్వంత్‌ల తల్లితండ్రులు జీవనాధారం కోసం గల్ఫ్‌ దేశానికి వెళ్లారు. చిట్వేలిలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో వీరిని చదివిస్తున్నారు. ఒక్కసారి ముగ్గురు పిల్లలు శవాలై కనిపించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. పిల్లల మరణానికి కారణమైందని గ్రామ ప్రజలు అంటున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: వేసవి విడిది కోసం బెస్ట్‌ ప్లేసులు ఇవే

( ap-crime-news | ap crime latest updates | latest-news )

Advertisment
Advertisment
Advertisment