YS Sharmila: 'విజయసాయిరెడ్డి మాటలకు షర్మిల కన్నీళ్లు'

విజయసాయి రెడ్డితో భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలను ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల వెల్లడించారు.విజయసాయి రెడ్డితో చాలా అంశాలు మాట్లాడాం. జగన్‌ వల్ల పడిన ఇబ్బందులను సాయిరెడ్డి నాకు చెప్పారు అంటూ షర్మిల వివరించారు.

New Update
YS Sharmila Vijaya Sai Reddy

YS Sharmila Vijaya Sai Reddy

విజయసాయి రెడ్డితో భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలను ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల వెల్లడించారు. ఈ సందర్భంగా జగన్‌ పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం , వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన విజయసాయి రెడ్డి కాంగ్రెస్‌ ఏపీ అధ్యక్షురాలు షర్మిలతో ఇటీవల భేటీ కావడం వైసీపీలో కలకలం రేపింది.

Also Read: Telangana: సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలపై బిగ్ అప్డేట్.. ఫిబ్రవరి 15 లోగా పూర్తి చేయాలని ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు

రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి, రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన ఆయన హైదరాబాద్‌ లో షర్మిల ఇంటికి వెళ్లారని దాదాపు 3 గంటల పాటు రాజకీయ అంశాల పై చర్చించారని మీడియాలో కథనాలు వచ్చాయి.తాజాగా స్పందించిన షర్మిల ఆ భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

Also Read: Vijayasai Vs Kethireddy: విజయసాయికి కేతిరెడ్డి కౌంటర్.. ఆ విషయం అందరికీ తెలుసంటూ సంచలన ట్వీట్!

 విజయసాయి రెడ్డితో చాలా అంశాలు మాట్లాడాం. జగన్‌ వల్ల పడిన ఇబ్బందులను సాయిరెడ్డి నాకు చెప్పారు.నా పిల్లలకు సంబంధించిన విషయమే ఇప్పుడు నేను అందరికీ చెబుతా. షేర్లు తనకే చెందాలంటూ నా పై , నా తల్లి పై జగన్‌ కేసు వేశారు. నా మాటలు అబద్దాలని విజయసాయి రెడ్డితో జగనే చెప్పించారు. సుబ్బారెడ్డి,విజయసాయి రెడ్డి మాటలు అసత్యమని విజయమ్మే చెప్పారు.

ఆ తరువాత కూడా విజయసాయి రెడ్డి పై జగన్‌ ఒత్తిడి తెచ్చారట.ఆయన అంగీకరించుకుంటే సుబ్బారెడ్డితో మాట్లాడించారు.ఆ తరువాత మళ్లీ విజయసాయిరెడ్డిని జగన్‌ పిలిపించి 40 నిమిషాలపాటు స్వయంగా డిక్టేట్‌ చేశారట! ఎలా చెప్పాలి, నా పై ఏం మాట్లాడాలో జగనే మొత్తం వివరించారట.తర్వాత ప్రెస్‌ మీట్‌ పెట్టకపోవడంతో జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారట. ఈ విషయాలన్నీ విజయసాయి  రెడ్డి నాకు స్వయంగా చెప్పారు.ఆయన చెప్పిన మాటలు విన్నాక కన్నీళ్లు వచ్చాయి.

వైఎస్‌ కోరికకు భిన్నంగా..

జగన్‌ ఇటీవల క్యారెక్టర్‌ గురించి పెద్ద పెద్ద డైలాగులు చెబుతున్నారు. అసలు క్యారెక్టర్‌ అంటే ఏమిటో జగన్‌ మరిచిపోయారు. వైఎస్‌ కోరికకు భిన్నంగా అబద్ధం చెప్పాలని విజయసాయి పై ఒత్తిడి చేశారు. నా పరువు పోతుంది.వదిలేయండి అన్నా..అని చెప్పినా జగన్‌ ఊరుకోలేదు.ఏ అబద్ధం ఎలా చెప్పాలో జగన్‌ చెబితే ...విజయసాయి రెడ్డి రాసుకున్నారట. ఇది జగన్‌ రెడ్డి మహోన్నతమైన క్యారెక్టర్‌.

సొంత మేనకోడలు, మేనల్లుడు ఆస్తులు కాజేయాలని జగన్‌ ఇన్ని కుట్రలు చేశారు. జగన్‌ అతని భార్య ఎంత దిగజారిపోయారో బైబిల్‌ ముందు కూర్చుని ఆలోచన చేయాలి. నా పిల్లలకు మీ ముఖం చూపించే ధైర్యం ఉందా? సొంత చెల్లి, ఆమె బిడ్డలకే వెన్నుపోటు పొడిచారు. 

మీరా..ఇంకొకరి గురించి మాట్లాడేది. దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో..జగన్‌ చెబితే అలా ఉంది.జగన్‌ కు విశ్వసనీయత ,విలువలు ఏ మాత్రం లేవు. నీతులు చెప్పే జగన్‌..ఆయన మాత్రం పాటించరు.వైఎస్‌పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన జగన్‌...ఆయన ఆశయాలను కాలరాశారు.మద్య నిషేధం అన్న వ్యక్తి..మద్యం ఏరులై పారించారు.

నీకు ఏ మాత్రం విలువలు,విశ్వసనీయత లేదు.సొంత చిన్నాన్నను చంపారని సీబీఐ అవినాష్‌ రెడ్డి పేరు చెప్పింది. అలాంటి వ్యక్తికి ఎంపీ సీటు ఇచ్చి పక్కన పెట్టుకున్నారు.ప్రాణం తీసే వరకు చిన్నాన్ననీతోనే ఉన్నారు కదా. సొంత చెల్లెలు క్యారెక్టర్‌ పై బురద చల్లారు. నా బిడ్డల ఆస్తుల కోసం ఇన్ని డ్రామాలా?  కుట్రలా? విజయసాయి రెడ్డి ఈ విషయాలన్నీ నాకు చెప్పారు. జగన్‌ ఇంత నీచంగా వ్యవహరిస్తారని తెలిసి బాధ కలిగింది.

విజయసాయి రెడ్డి ప్రయాణం ఏంటో నాకు తెలియదు అంటూ షర్మిల చెప్పుకొచ్చారు.

Also Read: Trump-America: అమెరికాలోని భారతీయులకు బిగ్ రిలీఫ్.. ఆ ఉత్తర్వులను కొట్టిపారేసిన కోర్టు

Also Read: Kshama Sawanth: ఇండో అమెరికన్ నాయకురాలు క్షమా సావంత్‌కు భారత్ వీసా తిరస్కరణ

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori: చంచల్‌గూడ జైలుకు అఘోరీ..  ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!

చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరీని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక బ్యారక్ సిద్దం చేసి లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు శ్రీ వర్షిణికి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా శంకర్‌పల్లి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

New Update
aghori ccg

Aghori going to Chanchalguda jail

Aghori: చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించి..  ప్రత్యేక బ్యారక్ సిద్దం చేశారు జైలు అధికారులు. ఇతర ఖైదీలను కలవకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీ వర్షిణిని అదుపులోకి తీసుకున్నారు శంకర్‌పల్లి పోలీసులు. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా కౌన్సెలింగ్ ఇచ్చారు.  

ఉత్తరప్రదేశ్ సరిహద్దులో అదుపులోకి..

ఇదిలా ఉంటే.. లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.  అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

లేడీ అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరీని చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

Aghori for Varshini | jail | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment