/rtv/media/media_files/2025/03/31/iQgTpHnJGXYKCW7KidgV.jpg)
suicide eluru
భర్త హత్య కేసులో నిందితురాలిగా ఉన్న రిమాండ్ ఖైదీ జైలులోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఏలూరు జిల్లా జైలులోని మహిళా బ్యారక్ లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. జీలుగుమిల్లి మండలం తాటాకుల గూడేనికి చెందిన గంధం బోసుబాబు పై ఈ నెల 17న రాత్రి దాడి జరిగింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు.
Also Read:chicken prices : రంజాన్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!
అక్కడ చికిత్స పొందుతూ బోసుబాబు చనిపోయాడు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. బోసుబాబు భార్య శాంతకుమారి, ఆమె ప్రియుడు సొంగా గోపాలరావు ఈ నేరానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించి వారిని న్యాయస్థానంలో హాజరుపరిచారు.
Also Read: YCp Ex Minister Kakani: మాజీ మంత్రి కాకాణి నివాసానికి పోలీసుల నోటీసులు
న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు.ఇద్దరిని జిల్లా జైలుకు తరలించారు. శాంతకుమారిని మహిళా బ్యారక్ లో ఉంచారు. జిల్లా జైలులోని మహిళా బ్యారక్ ను 30 మంది ఖైదీలు ఉండేలా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం శాంతకుమారితో కలిపి ఆరుగురు ఉన్నారు.
ఆదివారం ఉదయం బ్యారెక్ తెరిచారు.శాంతకుమారి బాత్ రూమ్ కి వెళ్లి వస్తానని మిగిలిన ఖైదీలకు చెప్పి బ్యారక్ లోకి వెళ్లింది. అల్పాహారం తినేందుకు ఎంతసేపటికీ రాకపోవడంతో వారు వెళ్లి చూడగా బ్యారక్ కిటికీ వద్ద చున్నీతో ఉరేసుకుని కనిపించింది. అంబులెన్సులో ఆమెను సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
జైలు సూపరింటెండెంట్ సీహెచ్‌ఆర్వీ స్వామి,వన్ టౌన్ సీఐ సత్యనారాయణ ఆసుపత్రికి వచ్చి పరిశీలించారు. జైలు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్‌యులు, పోలీసులు,జైలు అధికారుల సమక్షంలో ఆర్డీవో అచ్యుత్ అంబరీశ్ ఆసుపత్రి శవాగారం వద్ద మృతదేహానికి పంచనామా నిర్వహించారు.
మా కుమార్తెను కేసులో ఇరికించారని మృతురాలి తల్లి బత్తుల కుమారి,కుటుంబ సభ్యులు ఆరోపించారు.పోలీసులు ఒత్తిడి చేసి బెదిరించడం వల్లే నేరం చేసినట్లు అంగీకరించిందని , ఇప్పుడు అఘాయిత్యానికి పాల్పడటంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారని పేర్కొన్నారు. ఈ ఘటన పై ఎంఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు కందుల రమేష్ తదితరులు ఆసుపత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు.
మహిళా బ్యారక్ వద్ద విధులు నిర్వహించిన హెడ్ వార్డర్ ఎల్ వరలక్ష్మీ, వార్డర్ నాగమణిలను సస్పెండ్ చేస్తూ జైలు సూపరింటెండెంట్ సీహెచ్‌ఆర్వీ స్వామి ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Telangana: ఎంతకు తెగించార్రా.. గుడికి వచ్చిన వివాహితపై మాటువేసి గ్యాంగ్‌రేప్!
eluru | west-godavari | jail | prision | suicide | women | crime | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates