Suicide : విశాఖలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. హైదరాబాద్‌ నుంచి వెళ్లి లాడ్జిలో...

విశాఖ జిల్లా భీమిలి సాగరతీర ప్రాంతం లోఉన్న ఓ ప్రైవేట్ హోటల్ గదిలో శుక్రవారం సాయం త్రం ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. మృతుడు విశాఖ కోటవీధికి చెందిన రాజాన శ్యాంకుమార్ (26)గా గుర్తించారు.  హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నట్టు తెలుస్తోంది.

New Update
suicide

suicide

విశాఖ జిల్లా భీమిలి సాగరతీర ప్రాంతంలో ఉన్న ఓ  ప్రైవేట్ హోటల్ గది లో శుక్రవారం సాయంత్రం ఒక యువకుడు ఆత్మహత్య(HYD Software Employee Suicide) కు పాల్పడ్డాడు.హోటల్ సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న భీమిలి పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. మృతుడు విశాఖ కోటవీధికి చెందిన రాజాన శ్యాంకుమార్ (26)గా గుర్తించారు.  హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఓ యువతితో ప్రేమ సంబంధం ఉన్నట్లు సమాచారం. వారిద్దరి మధ్య  చోటుచేసుకున్న చిన్న గొడవ ఇద్దరూ ప్రాణాలు తీసుకునేలా చేసిందని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.

Also Read :  సాఫ్ట్‌వేర్‌ సునీత కేసు.. డెడ్‌బాడీ తీసుకెళ్లని భర్త.. ఎందుకో తెలిస్తే షాక్‌

Software Employee Commits Suicide In Visakhapatnam

ఘటనకు సంబంధించి పోలీసులు, కుటుంబసభ్యులు  తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖకు చెందిన శ్యామ్‌ కుమార్‌ హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే పావని అనే యువతితో  ప్రేమ(Love Affair) లో పడ్డాడు. ఇద్దరి మధ్య ఇటీవల చిన్న గొడవ రావడంతో పావని ఆత్మహత్య(commited-suicide) కు యత్నించింది. కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో హైదరాబాద్‌ లోని జీడిమెట్ల(jeedimetla) పోలీస్ స్టేష న్లో శ్యాంకుమార్ పై కేసు నమోదైంది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో శ్యామ్ కుమార్ భయపడిపోయాడు. ఈ నేపథ్యంలో అతను అక్కడి నుంచి పారిపోయి వచ్చి రెండు రోజుల కిందట భీమిలి బ్రాహ్మణ వీధిలోని లాడ్జిలో గది తీసుకుని ఉంటున్నాడు.

ఇదిలా ఉండగానే పావని చికిత్స పొందుతూ మృతి చెందిందని స్నేహితుల ద్వారా తెలుసుకున్న శ్యామ్ కుమార్ శుక్రవారం మద్యంలో విషం కలుపుకుని తాగి ప్రాణాలు తీసుకున్నాడు. శుక్రవారం మద్యాహ్నంగదిలోకి వెళ్లిన వ్యక్తి బయటకు రాక పోవడం గమనించిన హోటల్ సిబ్బంది అదనపు తాళం తో గది తలుపులు తెరచి చూడగా శుక్రవారం గదిలో  యువకుని మృతదేహం చూసి షాక్ కి గురయ్యారు. వెంటనే భీమిలి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతుని బంధువు లకు విషయం తెలియచేశారు. మృతుడి తమ్ముడు జోసెఫ్ ఇచ్చిన ఫిర్యాదు తో ఎస్ఐ ఎన్.గౌరి కేసు నమోదు చేసారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హోటల్ గదిలో ఓ సుసైడ్ నోట్ తో పాటు మద్యం సీసాలు ఎలుకలు మందు లభ్యం అయినట్టు పోలీసులు తెలిపారు. అతని టీ షర్ట్ ఫ్యాన్ కు ముడి వేసి ఉండగా మృతుని శరీరం నేలపై పడి ఉండటాన్ని గుర్తించి ఉరి వేసుకోవడానికి ప్రయత్నించి ఉంటాడని, అది కుదరకపోవడంతో మద్యంలో ఎలుకల మందు కలుపుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

మృతుని పై ప్రస్తుతం హైదరాబాద్ జీడి మెట్ల పోలీస్ స్టేషన్ లో కేసు తో పాటు గతం లో అనకాపల్లి ఆనందపురం స్టేషన్ లో ఫోక్సో కేసు నమోదు అయినట్టు పోలీసులు విచారణ లో తెలిశాయి. యువకుని మృతి కి సంబంధించి పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. శ్యామ్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రూము నుంచి రెండు సూసైడ్ నోట్లు, ఎలుకల మందు ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. శ్యామ్ కుమార్ రాసిన సూసైడ్ నోట్‌లో..‘నా చావుకు ఎవరూ కారణం కాదు. సారీ అమ్మ’ అని రాసి ఉన్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read :  ఆయేషా మీరా హత్య కేసు క్లోజ్.. 18ఏళ్ల విచారణ తర్వాత అంత్యక్రియలు

Advertisment
తాజా కథనాలు