/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/PAWAN-KALYAN-jpg.webp)
Janasena Photograph: (Janasena )
YCP-Janasena: వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు గట్టి షాక్ ఇచ్చేందుకు వైసీపీ నేతలు చాలా మంది రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే వైసీపీ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈరోజు జనసేన అధినేత , ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో తాడేపల్లి కార్యాలయంలో ఈ చేరికలు జరగనున్నట్లు తెలుస్తుంది.
కర్త,కర్మ,క్రియగా...
ఈ చేరికల కార్యక్రమానికి కర్త,కర్మ,క్రియగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహరించినట్లు తెలుస్తుంది. జనసేనలోకి చేరే నాయకులంతా కూడా ముందు రోజు రాత్రి విజయవాడకు చేరుకున్నట్లు తెలుస్తుంది. బాలినేని ప్రణీత్ వైసీపీ కార్పొరేటర్లు అందరితో చర్చలు జరిపి విజయవాడ తీసుకుని వెళ్లినట్లుగా తెలుస్తుంది.
ఇంతకు ముందు కూడా చాలాసార్లు కార్పొరేటర్లు ఒంగోలులోని బాలినేని ఇంట్లోనే బాలినేనితో మంతనాలు జరిపినట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే డిప్యూటీ మేయర్ తో సహా మరికొంతమంది YCP నీ వీడేందుకు ముహూర్తం ఖరారు అయ్యింది. జిల్లా పై పట్టు సాధించేందుకే బాలినేని మాస్టర్ ప్లాన్.. నెక్ట్ టార్గెట్ ZPTC స్తానంపైనే ఉన్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికీ జిల్లాలోని మెజారిటీ YCP ZPTC.MPP, సర్పంచులతో మాజీ మంత్రి బాలినేని టచ్ లో ఉన్నారని వినికిడి. ZP పీఠంపై జనసేన జండా ఎగురవేసి.. జిల్లాలో తన సత్తా జనసేన అధిష్టానానికి చూపించే ప్రయత్నాలు మొదలు పెట్టారు.తద్వారా రాష్ట్రస్థాయిలో మంచి పదవి సాధించాలని బాలినేని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.