🔴Live Breakings: తెలంగాణలో టీవీ సీరియల్స్‌ బంద్‌...?..మంత్రి పొన్నం సంచలనం..!

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Mar 21, 2025 12:16 IST

    తెలంగాణ హైకోర్టుకు యాంకర్‌ శ్యామల!

    బెట్టింగ్ యాప్‌ కేసులో యాంకర్‌ శ్యామల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని పిటిషన్ వేసింది. దీనిపై ఈ రోజే విచారణ జరగనుంది. Andhra365 గేమ్ ప్రమోట్ చేసిన శ్యామలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

    Shyamala
    Shyamala

     



  • Mar 21, 2025 12:15 IST

    తెలంగాణలో టీవీ సీరియల్స్‌ బంద్‌...?..మంత్రి పొన్నం సంచలనం..!



  • Mar 21, 2025 09:38 IST

    రేపటి నుంచే ఐపీఎల్.. నాలుగు కొత్త రూల్స్ తో..

    రేపటి నుంచే ఐపీఎల్ 2025 మొదలవనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్లేయర్లు ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొంటున్నారు. రేపు మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడుతున్నాయి. 

    IPL Tickets 2025
    IPL Tickets 2025

     



  • Mar 21, 2025 09:37 IST

    పాకిస్థాన్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 10 ఉగ్రవాదులు హతం

    పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రదాదులు, సైన్యం మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఖైబర్ పఖ్తుంక్వాలో ప్రావిన్స్‌లో తుపాకి తూటాలు పేలాయి. ఈ దాడుల్లో 10 మంది నిషేధిత ఉగ్రసంస్థకు చెందిన ఉగ్రవాదులు మరణించారు. అలాగే పాకిస్థాన్ ఆర్మీ కెప్టెన్‌ కూడా ప్రాణాలు కోల్పోయారు.

    Pakistan Army
    Pakistan Army

     



  • Mar 21, 2025 09:27 IST

    మరో డిజిటల్‌ అరెస్టు .. రూ.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు

    దేశంలో డిజిటల్ అరెస్టు కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలో ఓ వృద్ధురాలిని డిజిటల్ అరెస్టు పేరుతో ఆమెను ఇంట్లో బంధించి ఏకంగా రూ.20 కోట్లకు పైగా కాజేశారు.

    Digital Arrest
    Digital Arrest

     



  • Mar 21, 2025 09:26 IST

    తాగొచ్చి తల్లిని వేధించిన దుర్మార్గుడు.. చీర, కేబులు వైర్‌తో కాళ్లు, చేతులు కట్టేసి!

    ఖమ్మంలో అమానుష ఘటన జరిగింది. ఎదురుగడ్డ గ్రామంలో తాగొచ్చి వేధిస్తున్న కొడుకు రాజ్‌కుమార్‌ను తల్లి దూడమ్మ దారుణంగా హతమార్చింది. నిద్రలో ఉండగా తాళ్లు, కేబుల్ వైర్లతో కాళ్లు, చేతులు కట్టేసి ఊపిరాడకుండా చేసి చంపింది. దూడమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు.

    khammam
    khammam Photograph: (khammam)

     



  • Mar 21, 2025 08:20 IST

    అయోధ్య సాక్షిగా.. కామవాంఛ తీర్చుకుని మహిళను కాటికి పంపిన దుర్మార్గులు!

    యూపీలో మరో దారుణం జరిగింది. అయోధ్యకు చెందిన ఓ మహిళపై మలీహాబాద్‌లో సామూహిక అత్యాచారం జరిగింది. ఒంటరిగా వెళ్తున్న ఆమెను కిడ్నాప్‌ చేసిన ఆటో డ్రైవర్, మరికొంతమంది కామవాంఛ తీర్చుకుని గొంతు నులిమి చంపేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

     Gang rape
    Gang rape

     



  • Mar 21, 2025 08:19 IST

    అక్రమ వలసదారుల కోసం ట్రంప్ కొత్త యాప్



  • Mar 21, 2025 08:19 IST

    ఏపీకి మరో మూడు సార్లు అతనే సీఎం.. పవన్ సంచలన వ్యాఖ్యలు!

    ఏపీకి మరో మూడుసార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారని డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి మూడోసారి మోదీ ప్రధాని అయ్యారు. అలాగే చంద్రబాబు కూడా వరుసగా మూడు సార్లు సీఎం కావాలి. ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానన్నారు. 



  • Mar 21, 2025 08:18 IST

    మరో 30 రోజుల్లో గ్రూప్స్‌ నియామకాలు: సీఎం రేవంత్



  • Mar 21, 2025 08:18 IST

    నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్... 24 షీట్స్ బుక్ లెట్..

    తెలంగాణలో ఈరోజు నుంచే టెన్త్ ఎగ్జామ్స్ మొదలవనున్నాయి. నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 5.09 లక్షల మంది ఈసారి ఎగ్జామ్స్ రాయనున్నారు. 

    ap



  • Mar 21, 2025 08:17 IST

    భారత కేంద్ర ప్రభుత్వంపై ఎలాన్ మస్క్ ఎక్స్ దావా..



  • Mar 21, 2025 08:17 IST

    వేలంలో రూ.118 కోట్లు పలికిన ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్.. ఇందులో అంత ప్రత్యేకత ఏంటో తెలుసా?

    1950ల నాటి ప్రముఖ భారతీయ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ గీసిన ఓ గ్రామ్‌ యాత్ర అరుదైన రికార్డు సృష్టించింది.ప్రముఖ వేలం సంస్థ క్రిస్టీ న్యూయార్క్‌లో నిర్వహించిన వేలంలో.. 13.8 మిలియన్ డాలర్లకు రూ.118 కోట్లకు ఈ పెయింటింగ్ అమ్ముడుపోయింది.

    mfhussain
    mfhussain

     



  • Mar 21, 2025 08:16 IST

    ఫుల్లుగా తాగి కారు డ్రైవ్ చేసిన మేయర్..



Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pastor Praveen wines : వైన్ షాపులో పాస్టర్ ప్రవీణ్...రూ.950 ఫోన్ పే చేసి

పాస్టర్ ప్రవీణ్ కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. ప్రవీణ్‌ ఫోన్‌పే, పేటీఎం ట్రాన్సాక్షన్లు బయటపడ్డాయి. ఎల్బీనగర్‌ సవేరా వైన్స్‌లో లిక్కర్ షాపులో మధ్యాహ్నం 12:  24 నిమిషాలకు రూ. 950 ఫోన్ పే చేసి రెండు టీన్స్ బాటిల్ కొనుగోలు చేశారు ప్రవీణ్ .

New Update

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. ప్రవీణ్‌ ఫోన్‌పే, పేటీఎం ట్రాన్సాక్షన్లు బయటపడ్డాయి.  మార్చి 24వ తేదీ  ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నుంచి రాజమండ్రికి తన బైక్ పై బయలుదేరారు పాస్టర్ ప్రవీణ్. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  ఆయన కోదాడ, ఏలూరులో మద్యం బాటిళ్లు కొనుగోలు చేసినట్లుగా వీడియోలు సర్క్యూలేట్ అవుతున్నాయి. ఇప్పుడు మరో వీడియో కూడా వైరల్ అవుతోంది. ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బయలుదేరే ముందు ఎల్బీనగర్‌ సవేరా వైన్స్‌లో లిక్కర్ షాపులో మధ్యాహ్నం 12:  24 నిమిషాలకు రూ. 950 ఫోన్ పే చేసి రెండు టీన్స్ బాటిల్ కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి స్ర్కీన్ షాట్ ఆర్టీవీ చేతికి చిక్కింది. ముఖానికి మాస్క్ పెట్టుకుని మార్ట్ లోకి వెళ్లి లిక్కర్ కొనుగోలు చేశారు. 

Advertisment
Advertisment
Advertisment