/rtv/media/media_files/2025/04/07/33YraHTHK9LXGYEzR9db.jpg)
lemon
వేసవికాల ఎండలు భగభగమండుతున్నాయి. ఏప్రిల్ లోనే ఈ రేంజ్ లో ఇలా ఉంటే మేలో ఇంకేలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సహాజంగా వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు నిమ్మకాయలు ఎక్కువగా వాడతారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నిమ్మకాయల ధర మోత మోగుతుంది. గత నెలలో క్వింటా రూ. 6 వేల ఉన్న ధర ప్రస్తుతం 12 వేలకు పెరిగింది. ఎండలు, వడగాల్పులు పెరిగే కొద్దీ ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఏపీలోని ఏలూరు, రాపూరు, దెందులూరు, తెనాలిహోల్‌సేల్ మార్కెట్లకు రోజూ 2 వేల క్వింటాళ్ల దాకా నిమ్మకాయలు వస్తున్నాయి.
Also Read : భూ వివాదం.. కొడవలితో తల్లిదండ్రులపై దాడి చేసిన కొడుకు!
పెరుగుతున్న ధరలు
ప్రస్తుతం ఏపీలో లక్షా 20 వేల ఎకరాల్లో నిమ్మ తోటలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 10 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. కాగా వేసవిలో దిగుబడి తగ్గినా.. 4 లక్షల టన్నుల దాకా ఉత్పత్తి వస్తుందని అంటున్నారు వ్యాపారులు. నీటి వసతి ఉన్న తోటలకు ఈ సంవత్సరం కాపు బాగానే ఉంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఒక్కోటి నిమ్మకాయ సైజును బట్టి 4 నుంచి 10 రూపాయాల వరకు అమ్ముతున్నారు.
ఇది కూడా చదవండి: ఆ టాబ్లెట్ వల్ల గర్భిణీ స్త్రీలకు అలసట...ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది!
ఎండాకాలం సీజన్ ప్రారంభంలోనే నిమ్మకాయల ధరలు చూసి ప్రజలు భయ పడుతున్నారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ కూరగాయల మార్కెట్‌లో కిలో నిమ్మకాయలు రూ.100లకు విక్రయించారు. అందులో ఒక్కో నిమ్మకాయ సైజ్‌ను బట్టి రూ.5 నుంచి 10 అమ్మారు. అయితే ఇప్పుడు ఒక్క నిమ్మకాయ ధర రూ. 10లపైనే పలుకుతోంది. గత మూడు రోజులుగా కిలో నిమ్మకాయలు రూ. 200లకు విక్రయిస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు నిమ్మకాయ ధరలు చూసి కోనాలంటేనే భయపడుతున్నారు. అంతేకాకుండా... చిన్నపాటి కాయాలు, రసంలేని కాయలకు కూడా బాగా డిమాండ్ ఉంది. దీంతో వ్యాపారులకు బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా సాగుతోంది.
ఇది కూడా చదవండి: వీపు మీద మొటిమలు రావడానికి కారణం ఏమిటి?
Also Read : మేడ్చల్ రైల్వే స్టేషన్‌లో దారుణం.. యువతిపై అత్యాచారానికి యత్నించి..
lemon | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | andhra-pradesh-news | breaking news in telugu