/rtv/media/media_files/2025/02/08/3NDHsAkxLMUVwSuHG8Wh.jpg)
vijayasai reddy
ఏపీ రాజకీయ పార్టీల్లో కీలకమైన వైసీపీలో లుకలుకలు ఇప్పట్లో ఆగేలా లేవు. వైసీపీ చీఫ్,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మీద చేసిన కామెంట్స్ పై మాజీ రాజ్య సభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పందించారు.వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదన్నారు. భయం అనేది తనలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నానని తెలిపారు. ఆ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
Also Read: Kshama Sawanth: ఇండో అమెరికన్ నాయకురాలు క్షమా సావంత్‌కు భారత్ వీసా తిరస్కరణ
దీనికి కౌంటర్ గా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ''రాష్ట్ర రాజకీయాల్లో విలువలు, వ్యక్తిత్వం, విశ్వసనీయత ఉన్న నాయకుడు ఎవరన్నదీ ప్రజలందరికీ తెలుసు. ఆయనకు అవి ఉన్నాయి కాబట్టే, కనీస రాజకీయ నేపథ్యం లేకపోయినా ఆడిటర్‌గా ఉన్న వ్యక్తి అన్ని హోదాలు, అన్ని పదవులు అనుభవించాడు. పార్టీలో గొప్పగౌరవాన్ని పొందిన తర్వాత బయటకు వెళ్లిన తర్వాత మీకేదో చెప్పాడని, దాన్ని మాట్లాడ్డం అంటే, వైయస్.కుటుంబం యొక్క పరువును బజారుకు ఈడుస్తున్నది ఎవరో, ఇది ఎవరి కనుసన్నల్లో జరుగుతోందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు'' అంటూ గట్టిగా బదులిచ్చారు.
రాష్ట్ర రాజకీయాల్లో విలువలు, వ్యక్తిత్వం, విశ్వసనీయత ఉన్న నాయకుడు ఎవరన్నదీ ప్రజలందరికీ తెలుసు. ఆయనకు అవి ఉన్నాయి కాబట్టే, కనీస రాజకీయ నేపథ్యం లేకపోయినా ఆడిటర్‌గా ఉన్న వ్యక్తి అన్ని హోదాలు, అన్ని పదవులు అనుభవించాడు. పార్టీలో గొప్పగౌరవాన్ని పొందిన తర్వాత బయటకు వెళ్లిన తర్వాత మీకేదో…
— Kethireddy Venkatarami Reddy (@KethireddyMla) February 7, 2025
మరి ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. విజయసాయిరెడ్డి దీనికి బదులు ఇస్తారో లేదో వెయిట్ చేయాల్సిందే.
అంతకు ముందు ఏమన్నారంటే..!
రాష్ట్ర రాజకీయాల్లో విలువలు, వ్యక్తిత్వం, విశ్వసనీయత ఉన్న నాయకుడు ఎవరన్నదీ ప్రజలందరికీ తెలుసు. ఆయనకు అవి ఉన్నాయి కాబట్టే, కనీస రాజకీయ నేపథ్యం లేకపోయినా ఆడిటర్‌గా ఉన్న వ్యక్తి అన్ని హోదాలు, అన్ని పదవులు చేశాడు. పార్టీలో గొప్పగౌరవాన్ని పొందిన తర్వాత బయటకు వెళ్లిన తర్వాత మీకేదో చెప్పాడని, దాన్ని మాట్లాడ్డం అంటే, వైయస్.కుటుంబం యొక్క పరువును బజారుకు ఈడుస్తున్నది ఎవరో, ఇది ఎవరి కనుసన్నల్లో జరుగుతోందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.
వైసీపీ కీలకంగా వ్యవహరించి, జగన్ కు అత్యంత సన్నిహితంగా మెదిలిన విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం అందర్నీ షాక్ కు గురిచేసింది. ఎంపీ పదవితోపాటు.. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి తాను ఏ పార్టీలో కూడా చేరడం లేదని స్పష్టం చేశారు. వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తానంటూ వెల్లడించారు.
Also Read: Horoscope Today:నేడు ఈ రాశి వారికి ఆదాయం పదింతలు అవుతుంది...మీ రాశేనేమో చూసుకోండి మరి!
Also Read: Jeeth Adani: గుజరాతీ సంప్రదాయంలో వేడుకగా గౌతమ్ అదానీ చిన్న కుమారుడి వివాహం!