Fatal Accident: యమునా నదిలో ఘోర ప్రమాదం.. పడవ బోల్తా పడి 9 మంది మృతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథురా జిల్లాలోని బృందావన్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. మథుర సమీపంలోని యమునా నదిలో యాత్రికులతో వెళ్తున్న పడవ బోల్తా పడటంతో తొమ్మిది మంది మృతి చెందారు.

New Update
FotoJet (23)

9 people died after boat capsized

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం(uttarpradesh) మథురా జిల్లాలోని బృందావన్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. మథుర(madhura) సమీపంలోని యమునా నది(yamuna-river) లో యాత్రికులతో వెళ్తున్న పడవ బోల్తా పడటం(boat-capsized) తో తొమ్మిది మంది మృతి చెందారు. పలువురు యాత్రికులు నదిలో గల్లంతయ్యారు.శుక్రవారం మధ్యాహ్నం 2.45 గంటలకు కేసీ ఘాట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సీ ఘాట్‌ వద్ద ఉన్న పాంటూన్‌ వంతెనను పడవ ఢీకొట్టడంతో  బోల్తా పడినట్లు అధికారులు చెబుతున్నారు.  ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.  

Also Read :  ప్రేమోన్మాది ఘాతుకం.. మైనర్ బాలిక గొంతుకోసి హత్య

Fatal Accident In Yamuna River

లూథియానాకు చెందిన యాత్రికులు  రెండు బోట్లలో మధురాకు వస్తున్నారన్నారు. మథుర సమీపంలో ఫ్లోటింగ్‌ బ్రిడ్జిని ఈ పడవ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల సమచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.  స్థానిక మత్స్యకారులు, పోలీసులు స్పందించి సహాయ చర్యలు చేపట్టారు. సహాయక చర్యల్లో భాగంగా 17 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా మేజిస్ట్రేట్ సీపీ సింగ్ వెల్లడించారు. గల్లంతైన వారిలో ఎక్కువ మంది ఇతర ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులే ఉన్నట్లు తెలుస్తోంది.గల్లంతైన వారిలో ఇప్పటివరకు తొమ్మిది మంది మృతదేహాలను వెలికి తీసినట్లు సమాచారం.

ప్రమాద సమయంలో పడవలో సుమారు 25 మంది ఉన్నట్లు సమాచారం. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గజ ఈతగాళ్లతో సహాయక చర్యలను వేగవంతం చేసింది. గల్లంతైన వారిలో ఎక్కువ మంది ఇతర ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులే ఉన్నట్లు తెలుస్తోంది. యమునా నదిలో ప్రవాహం ఎక్కువగా ఉండటం, తాత్కాలిక వంతెన అడ్డుగా రావడంతో పడవ అదుపు తప్పి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. గల్లంతైన వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని, ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాల సహాయం కూడా కోరినట్లు అధికారులు వెల్లడించారు.  

Also Read :  మోహన్ బాబుకు ఊరట... తొందరపాటు చర్యలు వద్దన్న హైకోర్టు

Advertisment
తాజా కథనాలు