AP BREAKING: ఏపీలో రైలు ప్రమాదం

రైలు పట్టా విరిగి పెను ప్రమాదం తప్పిన ఘటన తిరుపతి జిల్లాలోని గూడూరులో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.ఓ గొర్రెల కాపరి పట్టా విరిగి ఉండటాన్ని గమనించి వెంటనే రైల్వే అధికారుల కు సమాచారం అందించాడు.

New Update
Train Track Broken:ఆంధ్రలో తప్పిన రైలు ప్రమాదం..విరిగిన రైలు పట్టా.

Train Track Broken Photograph: (Train Track Broken)

Ap Breaking: రైలు పట్టా విరిగి పెను ప్రమాదం తప్పిన ఘటన తిరుపతి జిల్లాలోని గూడూరులో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ నుంచి తిరుపతి  వెళ్లే మార్గంలో రైలు పట్టా విరిగిపోయింది. ఈ క్రమంలోనే గొర్రెలు కాసేందుకు అటుగా వెళ్లిన ఓ గొర్రెల కాపరి పట్టా విరిగి ఉండటాన్ని  గమనించి వెంటనే రైల్వే అధికారుల కు సమాచారం అందించాడు. 

Also Read:  Nagababu: నాగబాబుకు రూ.59 కోట్ల ఆస్తి, బెంజ్ కారు.. చిరు, పవన్ దగ్గర అప్పు.. అఫిడవిట్ లో ఆసక్తికర విషయాలు!

దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. అయితే, వెంటనే అలర్ట్ అయిన అధికారులు రైల్వే ట్రాక్‌ కు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. అసలు ట్రాక్ విరగడానికి కారణం కుట్ర ఏమైనా ఉందా.. అన్న కోణంలో రైల్వే పోలీసులు విచారణ ప్రారంభించారు.

Also Read: Rains: రైతులకు షాక్.. ఈ ఏడాది వానలు అంతంత మాత్రమే.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే!?

Also Read: SLBC breaking : టన్నెల్ ప్రమాదంలో కీలక పురోగతి....కార్మికుల ఆన‌వాళ్లు గుర్తించిన కేర‌ళ జాగిలాలు

Also Read: Car Offers In March: కారు కొనేవారికి గుడ్ న్యూస్.. రూ.55 వేల భారీ డిస్కౌంట్ పొందే ఛాన్స్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heavy Rains: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌

తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్, మెదక్ తదితర జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

New Update

తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్యుములోనింబస్‌ మేఘాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్, మెదక్, వికారాబాద్,  మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. 

Also Read: తెలంగాణలో భారీ వర్షాలు.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి!

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా, అనంతపురం, కడప, ప్రకాశం జిల్లాల్లో జల్లులు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలాఉండగా గంటసేపు వర్షంతో హైదరాబాద్ రోడ్లనీ చెరువులను తలపిస్తున్నాయి. పలు చోట్ల ఈదురుగాలులతో చెట్లు విరిగిపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్  జారీ చేసింది. 

Also Read: భూవివాదంలో సుప్రీం కోర్టు సీరియస్.. ‘ఏం జరిగినా పూర్తి బాధ్యత CS’

 

Advertisment
Advertisment
Advertisment