/rtv/media/media_files/2025/10/08/big-shock-for-mohan-babu-2025-10-08-07-09-32.jpg)
Big shock for Mohan Babu.. AP High Court refuses to grant protection
Mohan Babu: సినీ నటుడు మోహన్ బాబు(manchu mohan babu) ఏపీ హైకోర్టు(ap-high-court) లో చుక్కెదురైంది. విద్యార్థినాయకుల కిడ్నాప్ కేసు(Kidnap in Tirupati) లో అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. కాగా క్వాష్ పిటిషన్ పై తదుపరి విచారణ మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. విద్యార్థి సంఘం నాయకుల కిడ్నాప్ కేసులో ఫోన్ కాల్స్, మెసేజులు విశ్లేషించి ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక రావాల్సి ఉందని హైకోర్టు తెలిపింది. ఈ సమయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో ఎఫ్ఐఆర్ ఆధారంగా తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరిన మోహన్ బాబు తరుపు న్యాయవాది అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అనంతరం అనుబంధ పిటిషన్ కొట్టివేస్తూ క్వాష్ పిటిషన్ మీద విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. వ్యాజ్యంపై లోతైన విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది.
Also Read : 'నువ్వు కూడా హీరోవా..?' ‘హే బలవంత్’ ప్రమోషన్‌లో హీరో సుహాస్ ఎమోషనల్..!
అసలేం జరిగిందంటే?
సినీ నటుడు మోహన్ బాబు తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ(mohan-babu-university) లో(ఎంబీయూ) పేరుతో ఓ యూనివర్సిటీని నిర్వహస్తున్న విషయం తెలిసిందే. ఇందులో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ కొన్ని విద్యార్థి సంఘాలు.. కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడానికి నిర్ణయించాయి.అయితే ఈ ధర్నాకు బయల్దేరిన విద్యార్థి సంఘం నేతలు మధ్యలోనే కిడ్నాప్‌కు గురయ్యారు. దీనిపై మిగతా విద్యార్థి సంఘం నాయకులు తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన జిల్లా ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు.. నారావారిపల్లి సమీపంలో ఉన్న భీమవరం వద్ద కిడ్నాపర్ల వాహనాన్ని అడ్డుకున్నాయి. కిడ్నాపర్ల నుంచి విద్యార్థి సంఘం నేతలను విడిపించారు. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరంతా మోహన్ బాబు కాలేజీకి చెందిన బౌన్సర్లుగా గుర్తించారు. విద్యార్థి సంఘాల నాయకుల ఫిర్యాదుతో మోహన్ బాబు మీద పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా తనపై కేసు నమోదు కావడంతో తనను అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతో ఈ కేసులో తనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని మోహన్ బాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన హైకోర్టు.. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని పిటిషన్ కొట్టివేసింది. మరోవైపు కిడ్నాప్ ఘటనతో పిటిషనర్‌కు సంబంధం లేదని మోహన్ బాబు తరఫు న్యాయవాదులు చెప్పడం గమనార్హం. కిడ్నాప్ జరగిన సమయంలో ఆయన అక్కడ లేరని.. ఆ తర్వాతే హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చారరి న్యాయవాది తెలిపారు. ఇందుకోసం బోర్డింగ్ పాస్ వివరాలను కోర్టు ముందు ఉంచారు. మోహన్ బాబు యూనివర్సిటీ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొంతమంది కుట్రలు పన్నుతున్నారని.. కిడ్నాప్ వ్యవహారం వెనుక ఎవరున్నారనేదీ తెలుసుకుంటామని న్యాయవాది కోర్టుకు ఇంతకుముందే తెలియజేశారు.
Also Read : కలెక్షన్లు కుమ్ముతున్న సౌందర్య రజినీకాంత్ 'With Love’ సినిమా..
Follow Us