/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/heat-3-jpg.webp)
Ap-Tg Weather Updates
ఏపీలో భానుడు భగభగమంటున్నాడు. ఈ క్రమంలోనే రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.విపరీతంగా వేడిగాలులు వీస్తున్నాయి. శనివారం శ్రీకాకుళం జిల్లా -6, పార్వతీపురం మన్యం -12, అల్లూరి సీతారామరాజు-3, విజయనగరం-9, కాకినాడ-3, తూర్పుగోదావరి-2 మండలాల్లో తీవ్రవడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉంది' అన్నారు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. నేడు 181 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి' అన్నారు ఎండీ రోణంకి కూర్మనాథ్.
Also Read: Ugadi: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
శుక్రవారం 15 మండలాల్లో తీవ్రవడగాలులు, 90 మండలాల్లో వడగాలుల వీచాయన్నారు. శుక్రవారం 181 ప్రాంతాల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం ప్రకాశం జిల్లా తాటిచెర్ల, కడప జిల్లా కమలాపురంలో 42.6 డిగ్రీలు, నంద్యాల జిల్లా ఆలమూరులో 42.5, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 42.2, అనకాపల్లి జిల్లా రావికమతంలో 42.1, అన్నమయ్య జిల్లాలో 42 చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు.
Also Read: Ap:ఏపీలో వీరికి ఆదివారం.. రంజాన్ సెలవులు లేవు..
Ap-Tg Weather Updates
మరోవైపు రాష్ట్రంలో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. టెక్నాలజీ ఉపయోగించి ప్రజల మొబైల్స్‌కు అలర్ట్ మెసేజ్ పంపుతోంది. ఆ జిల్లాల్లో ప్రజలు మెసేజ్‌ను చూసి ఓకే బటన్ నొక్కే వరకూ ఫోన్ మోగేలా ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సాధ్యమైనంత వరకు ఎండకు దూరంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ. సూచించింది. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మెసేజ్‌లో సూచించారు. ఎక్కువగా నీరు, మజ్జిగ, గ్లూకోజ్, నిమ్మరసం, కొబ్బరి నీరు, ఓఆర్‌ఎస్ వంటివి తాగాలనే ఆ మెసేజ్‌లో సూచిస్తున్నారు.
తెలంగాణలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. మాడు పగిలే ఎండలతో ప్రజలు ఠారేత్తిపోతున్నారు. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 నుంచే భానుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం వేళల్లో అయితే భగభగ మండే ఎండలతో ప్రజలు బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. రాష్ట్రంలోని ప్రధాన రహదారులు ఉదయం 11 గంటల సమయంలోనే నిర్మానుష్యంగా మారుతున్నాయి. తీవ్ర ఎండలు, ఊపిరాడకుండా చేసే ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
రాత్రి వేళల్లో గాలిలో తేమశాతం తగ్గిపోవటంతో ఉక్కపోత వంటి వాతావరణం ఉంటుంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎండలు సాధారణం కన్నా అధికంగా నమోదవుతున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శుక్రవారం (మార్చి 28) రాష్ట్రంలోనే అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ గ్రామంలో 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ జిల్లాలో గత కొన్ని రోజులుగా సాధారణం కన్నా 2.1 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నట్లు చెప్పారు.
నేటి నుంచి ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, యాదాద్రి-భువనగిరి జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కుమురంభీం-ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జోగులాంబ-గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాలకు ఆదివారానికి ఆరెంజ్ రంగు హెచ్చరికను జారీ చేసింది.
Also Read: Priyanka Gandhi: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!
Also Read: Israel-Netanyahu: ప్రతిదాడులు తప్పవు..లెబనాన్ కు నెతన్యాహు హెచ్చరికలు!
weather | Andhra Pradesh and Telangana Weather Report | andhra pradesh weather | AP Weather Alert | ap-weather | ap today weather update | kurnool | tirupati | prakasam | hyderabad | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates