/rtv/media/media_files/2025/01/01/0aVmOu1hnxxnFs0bDOzK.jpg)
Liquor Photograph: (Liquor)
ఏపీలో కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం దర్యాప్తుకు సిద్ధమైంది. 2019 నుంచి 2024 మధ్య మద్యం అక్రమాలపై విచారణకు సిట్ బృందం ఏర్పాటురు ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ఈ సిట్ ఏర్పాటైంది. ఈ దర్యాప్తు సహకరించాలని ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కు ఆదేశాలు చేసింది.
Also Read: USA: హెచ్ 1 బీ ఆటో రెన్యువల్ రద్దు చేస్తారా?
ఏడుగురుతో సిట్ బృందం..
మద్యం అక్రమాలపై ఏర్పాటు చేసిన సిట్ బృందంలో.. విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు చీఫ్‌గా వ్యవహరిస్తారు. ఇందులో సభ్యులుగా ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ ఎస్పీ సుబ్బారాయుడు, సీఐడీ ఏఎస్పీ శ్రీహరిబాబు, అదనపు ఎస్పీ కొల్లి శ్రీనివాస్, డోన్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శివాజీలను నియమించారు. ఏపీ సీఐడీ డీఐజీ ఆధ్యర్వంలో సిట్ పనిచేయనుంది. ఈ సిట్ చేస్తున్న దర్యాప్తు వివరాలను ప్రతి 15 రోజులకు ఓసారి ప్రభుత్వానికి వివరాలు తెలియజేయనుంది. ఇక ఈ దర్యాప్తు బృందానికి పూర్తి అధికారాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. 2019 అక్టోబరు నుంచి 2024 మార్చి వరకు రాష్ట్రంలో మద్యం విక్రయాలకు సంబంధించి రూ.90వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. నగదు లావాదేవీలతో పాటు హోలో గ్రామ్‌ల వ్యవహారంలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్టు చెబుతున్నారు.
Also Read: TS: షాద్ నగర్ ప్రైవేట్ పాఠశాలలో ఘోరం..విద్యార్థి ఆత్మహత్య