Weather: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన భారీ వర్షాలు!
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ రెండు రోజులు పలుజిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ళ వానలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. 40నుంచి50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.