/rtv/media/media_files/2025/02/22/LKGjuj556WpcCbdiwDLN.jpg)
crime ap
AP Crime: ఏపీ అనకాపల్లి జిల్లా మునగపాకలో ఘోరం జరిగింది. తమ అక్రమ సంబంధం బయటపడుతుందనే భయంతో పక్కింటి మహిళను ప్రియుడు-ప్రియురాలు రక్తం కక్కేలా కొట్టడం కలకలం రేపుతోంది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
ప్రియుడిని ఇంటికి రప్పించుకుని..
ఈ మేరకు ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. దీపిక అనే మహిళ పిల్లలతో కలిసి మునగపాక ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటుంది. ఆమె ఇంటికి పక్కనే రాజ్ కుమార్ - సరిత దంపతులు నివసిస్తున్నారు. రాజ్ కుమార్ అచ్చుతాపురంలోని ఓ కంపెనీలో విధులు నిర్వహిస్తుంటాడు. భర్త డ్యూటీకి వెళ్లిన తర్వాత సరిత తన ప్రియుడిని ఇంటికి రప్పించుకునేది. ఈ విషయం గమనించిన దీపిక.. తన భర్త రాజ్ కుమార్‌కి తెలియజేస్తుందేమో అన్న అనుమానంతో సరిత ఆమె ప్రియుడు హత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఇది కూడా చదవండి: Stalin: రూ.10 వేల కోట్లు ఇచ్చిన జాతీయ విద్యా విధానం అమలు చేయం: సీఎం స్టాలిన్
శుక్రవారం రాత్రి 10:30 గంటల సమయంలో ప్రియుడు, ప్రియురాలు దీపిక ఇంట్లోకి చొరబడ్డారు. ఆమె నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు-చేతులు కట్టేసి ఇనుపరాడ్డులతో దాడి చేశారు. అదే సమయంలో రాజ్ కుమార్ డ్యూటీ నుంచి ఇంటికి రాగా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పక్కింట్లో వచ్చిన శబ్దాలు అతడిని అనుమానం వచ్చింది. వెళ్లి చూడగా, దీపిక రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో కనిపించింది. స్థానికుల సహాయంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి దీపికను ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Bird Flu in Telangana: తెలంగాణలో మొదటి బర్డ్ ఫ్లూ కేసు
బాధితురాలి ఫిర్యాదు మేరకు సరిత, ఆమె ప్రియుడు శాంతిరాజ్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై మునగపాక సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ రావు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మునగపాకలో ఈ ఘటన కలకలం రేపగా స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.